Advertisementt

క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’

Tue 11th Feb 2020 01:41 PM
cricketer,harbhajan singh,friendship,movie,details  క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’
Cricketer Harbhajan Singh Turns Hero with Friendship క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’
Advertisement
Ads by CJ

ఇండియ‌న్ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఫ్రెండ్ షిప్’  

ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేశారు. తన సుదీర్ఘ  క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పిన బజ్జీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ఒక సినిమాలో హీరోగా నటించేందుకు మొద‌టిసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. తమిళంలో ‘ఫ్రెండ్ షిప్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్నఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్‌&స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెండు చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉన్న ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతోంది. ఈ చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెళ్లడించబోతున్నారు.  వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఏడాది సమ్మర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌ చేయ‌నుంది చిత్ర యూనిట్‌.

Cricketer Harbhajan Singh Turns Hero with Friendship:

Cricketer Harbhajan Singh Friendship Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ