Advertisementt

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’కి డేట్ ఫిక్స్!

Mon 10th Feb 2020 10:23 PM
anukunnadhi okkati ayyinadi okati,release,march 6  ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’కి డేట్ ఫిక్స్!
Anukunnadhi Okkati Ayyinadi Okati Release Date Fixed ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’కి డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

మార్చి 6న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు విడుదల తేదీ మార్చి 6 అయ్యింది. బహుశా... ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ అంటే ఇదేనేమో! ‘కొన్నిసార్లు రావడం లేట్ అవ్వవొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా’ అని ‘గోపాల గోపాల’లో పవన్ కల్యాణ్ చెప్పినట్టు మార్చి 6న మా సినిమా రావడం పక్కా అని సినిమా యూనిట్ అంటోంది.   

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. 

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ... ‘‘ధన్యా బాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. త్రిధా చౌదరి జర్నలిస్ట్. కోమలీ ప్రసాద్ ఫ్యాషన్ డిజైనర్. సిద్ధీ ఇద్నాని హౌస్ వైఫ్. ఈ నలుగురు స్నేహితులు. గోవాలో ఫ్రెండ్ పెళ్లికి వెళతారు. ఉద్యోగాల ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి అక్కడ రీఫ్రెష్ అవ్వాలనుకుంటారు. ప్రమాదవశాత్తూ వీళ్లకు పరిచయం ఉన్న ఓ అబ్బాయి మరణిస్తాడు. అతడు ఎలా మరణించాడు? తర్వాత ఈ నలుగురు అమ్మాయిలూ ఏం చేశారు? అన్నది ఆసక్తికరం. గోవా నేపథ్యంలో కామెడీ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించాం. గోవాలో 40 రోజులు షూటింగ్ చేశాం. టాకీతో పాటు రెండు పాటలు గోవాలో చిత్రీకరించాం. కామెడీతో పాటు థ్రిల్ ఇచ్చే సినిమా ఇది’’ అని అన్నారు. 

నటీనటులు:

ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ యేరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బాడిస, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

Anukunnadhi Okkati Ayyinadi Okati Release Date Fixed:

Anukunnadhi Okkati Ayyinadi Okati to Release on March 6 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ