Advertisementt

గీతాఆర్ట్స్-2 బ్యానర్‌లో విజయ్ హ్యాట్రిక్ సినిమా!?

Mon 10th Feb 2020 10:16 PM
vijay devarakonda,third movie,geetha arts-2,allu aravind  గీతాఆర్ట్స్-2 బ్యానర్‌లో విజయ్ హ్యాట్రిక్ సినిమా!?
Vijay Devarakonda Movie in Geetha Arts-2 గీతాఆర్ట్స్-2 బ్యానర్‌లో విజయ్ హ్యాట్రిక్ సినిమా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీతా ఆర్ట్స్-2’ బ్యానర్‌లో ‘గీత గోవిందం’ సినిమా ఏ రేంజ్‌లో ఆడిందో ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ అనే హాట్ హాట్ సినిమాతో స్టార్ అవ్వగా.. ‘గీతగోవిందం’ సినిమా విజయ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే ఆ తర్వాత అదే బ్యానర్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ మాత్రం ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో ‘గీతా ఆర్ట్స్-2’ బ్యానర్‌లో హ్యాట్రిక్ మూవీకి.. టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెడీ అయ్యారు. అయితే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా..? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రేమికుల రోజున ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ విజయ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గానే చిత్రబృందం జరిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘విజయ్‌తో మరో సినిమా చేయాలనే ఆసక్తిగా ఉంది. దేవరకొండ ఓకే అంటే నా వైపు నుంచి ఎలాంటి ఆలస్యం ఉండదు’ అని వేదికపైనే అల్లు అరవింద్ చెప్పేశాడు. అయితే ఈ మాటల విన్న విజయ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు.

వాస్తవానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా తనకు క్రేజీ స్టార్‌ స్టేజ్‌కు తీసుకెళ్లగా.. ‘గీత గోవిందం’ తన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అయితే అలా తన లైఫ్‌ను తిప్పిన ‘గీతా ఆర్ట్స్-2’ లో మరో సినిమా అంటే.. విజయ్ ఎందుకు రెడ్ సిగ్నల్ ఇస్తాడు.. కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అయితే ఆ బ్యానర్‌లో కాస్త లేటవ్వచ్చేమో కానీ సినిమా మాత్రం పక్కా అని అర్థం చేసుకోవచ్చు. బహుశా డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా తర్వాత ‘గీతా ఆర్ట్స్-2’లో సినిమా ఉంటుందేమో. అంటే హ్యాట్రిక్ కొట్టేయాలని అటు అల్లు అరవింద్.. ఇటు విజయ్ గట్టిగానే స్కెచ్ వేశారన్న మాట. మరి ఎంతవరకూ ఇది వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే.

Vijay Devarakonda Movie in Geetha Arts-2:

Vijay Devarakonda Movie in Geetha Arts-2  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ