టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? ఆమె ఒప్పుకుంటే రెండో పెళ్లి చేసుకోవడానికి రాజుగారు రెడీగా ఉన్నారా..? తోటి మిత్రులు, దగ్గరి బంధువుల సూచన, ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ‘దిల్’కు మరో ‘దిల్’కు తోడుకానుందా..? గత రెండ్రోజులుగా వస్తున్న వార్తలు, పుకార్లు.. టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన అంశాలను బట్టి చూస్తే దాదాపు ఇదే నిజమని అనిపిస్తోంది. ఇంతకీ రాజుగారు మనసులో ఏముంది..? నిజంగానే ‘ఆమె’ ఒప్పుకుంటే రాజుగారి పెళ్లి చేసుకుంటారా..? అనే విషయాలు www.cinejosh.com ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో నిర్మాతలుగా ఒకప్పుడు రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్ బాబు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం దిల్ రాజు అంటే టాలీవుడ్.. టాలీవుడ్ అంటే దిల్ రాజు అనేలా పరిస్థితులను క్రియేట్ చేసుకున్నాడాయన. అంటే మిగిలిన ప్రొడ్యూసర్లు కూడా క్రీజులోనే ఉన్నారు కానీ.. వారికంటే కాస్త ముందు వరుసలో దిల్ రాజు ఉన్నాడని దాని అర్థం. ఇలా అన్నీ ఉన్నప్పటికీ రాజుగారి మదిలోని బాధ మాత్రం ఎవరికీ చెప్పుకోలేక.. మదనపడుతున్నాడట. అదేమిటంటే.. భార్య అనిత మృతి. ఆయన భార్య మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోతున్న ఆయనకు దగ్గరి బంధువులు, సన్నిహితులు రెండో పెళ్లి చేసుకోవాలని సూచించారట.
అయితే.. రాజు-అనిత దంపతులకు ముద్దుల కుమార్తె ఉంది. ఆమెకు కూడా పెళ్లయ్యింది. అయితే.. ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనే యోచనలో రాజుగారు ఉన్నారని టాక్ నడుస్తోంది. కూతురు వద్దంటే వద్దు.. సరే అంటే సరే అనాలని దిల్ రాజు అనుకుంటున్నట్లు గత రెండ్రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అయితే ఇటు సోషల్ మీడియాలో.. అటు మీడియాలో.. ఓ రేంజ్‌లో వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ ఆయన స్పందించిన దాఖలాల్లేవ్. అంటే నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా.. మౌనానికి అర్థం అంగీకారమే అన్న మాట. మరీ ముఖ్యంగా తనకు సంబంధించి వ్యక్తిగతంగా ఎలాంటి వార్తలు వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే దిల్ రాజు ఈ రెండో పెళ్లి వ్యవహారంపై మాత్రం స్పందించలేదంటే ఏమని అర్థం చేసుకోవాలో ఏంటో..!