గత నాలుగైదు రోజుల నుండి సుకుమార్ కి అల్లు అర్జున్ కి మధ్యన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎడతెగని చర్చ జరుగుతున్నట్టుగా ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లోను వెబ్ మీడియాలోనూ నడుస్తుంది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ సినిమా మొదలెట్టాడు. అయితే అల వైకుంఠపురములో మ్యూజికల్ గా హిట్ అవడంతో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నే సుక్కు సినిమాకి తీసుకుందామని ప్రపోజల్ పెట్టడమే కాదు.. సుక్కుని ఫోర్స్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. సుక్కుకి, దేవిశ్రీ మీద పూర్తి నమ్మకంతో ఉండడంతో అల్లు అర్జున్ ని కన్విన్స్ చేస్తూ వస్తున్నాడనే టాక్ వినబడింది.
అయితే సుకుమార్ కి మాత్రం దేవిశ్రీ మీద పూర్తి నమ్మకం ఉందని ఇప్పటివరకు తనతోనే పనిచెయ్యడంతో దేవితో కంఫర్ట్ ఉంటుంది అని అల్లు అర్జున్ పెట్టిన ప్రపోజల్ ని సుకుమార్ సున్నితంగా తిరస్కరించి, దేవిశ్రీ బెస్ట్ సాంగ్స్ ఇస్తాడని కన్విన్స్ చేశాడట. సుకుమార్ తో దేవిశ్రీ రంగస్థలంతో బెస్ట్ ఆల్బమ్ చెయ్యడమే కాకుండా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డులు, రివార్డులు అందుకున్నాడు కూడా. అందుకే సుక్కు, అల్లు అర్జున్ ఏం చెప్పిన వినకుండా దేవితోనే ఈ సినిమా కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యి అల్లు అర్జున్ కూడా తన దారిలోకి తెచ్చేసుకున్నాడనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది.