చాలా మంది టాలీవుడ్ హీరోలు ఈ మధ్యన మల్టీ టాస్కింగ్ అంటూ అటు హీరోలుగాను, ఇటు నిర్మాతలుగా మారిపోయి డబ్బు సంపాదించేద్దామనుకుంటున్నారు. కాని ఫలితాలను పరిశీలిస్తే మాత్రం మల్టీ టాస్కింగ్ ప్రయత్నాలు చాలాసార్లు బెడిసికొడుతున్నాయి. యంగ్ హీరోస్ నాని, నితిన్, విజయ్ దేవరకొండ, నాగ శౌర్య వంటి నటులు నిర్మాతలను మార్చి వారే నిర్మాతలుగా మారి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వారు విఫలమయ్యారనే చెప్పాలి. అఖిల్ తొలి చిత్రం అఖిల్‌ను నిర్మించడం ద్వారా బాక్సాఫీస్ షేక్ చెయ్యాలని కలలు కన్న నితిన్.. అఖిల్ దెబ్బకి నిర్మాణం వైపు చూడడమే మానేసాడు.
ఇక మరో యంగ్ హీరో నాగ శౌర్య అయితే సొంత ప్రొడక్షన్ లో ఛలో సినిమా చేసి అతిపెద్ద హిట్ కొట్టాడు. అదే క్రేజ్ తో నాగ శౌర్య నర్తనశాల చేసి చేతులు కాల్చుకున్నాడు. అయినప్పటికీ.. అశ్వద్ధామతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించాడు. తానే కథ రాసి మరీ నిర్మాతగా మారి హీరోగా చేస్తే.. ఇప్పుడు ఆ సినిమా కూడా శౌర్యకి షాకిచ్చింది. ఇక నాని కూడా ‘డి ఫర్ దోపిడీ’, ‘అ!’ సినిమాలు ఓన్ గా నిర్మించాడు. ఆ రెండు సినిమాలు సో సో గా ఆడగా.. తదుపరి చిత్రం హిట్ బాక్సాఫీస్ వద్దకి రావడానికి రెడీ అయ్యింది. మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా మీకు మాత్రమే చేప్తాతో కలిసి నిర్మాతగా మారాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు షాకిచ్చింది.
దీనిని బట్టి కొంతమంది సినీ విశ్లేషకుల మాట ఏమిటంటే.. హీరోలు కేవలం వారి నటనపై దృష్టి పెట్టాలి. కానీ అదే టైంలో నిర్మాణం అంటూ హడావిడి చేస్తే.. అటు హీరోలుగా కెరీర్ లో దెబ్బతినాలి. ఇటు సినిమా పోతే నిర్మాతగానూ డబ్బు లాస్ కావాలి. కాబట్టి హీరోలు కేవలం నటన మీద ఫోకస్ పెట్టి.. నిర్మాణం విషయంలో కాస్త తగ్గితే బెటరంటున్నారు.