Advertisementt

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్ వదిలారు

Mon 10th Feb 2020 09:01 PM
raj tarun,orey bujjigaa,first look,release  ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్ వదిలారు
Orey Bujjigaa Movie First Look Released ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

రాజ్‌తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌, కె.కె.రాధామోహన్‌ ల ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ ఫస్ట్ లుక్ విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్ లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 లకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ‘‘మా ‘ఒరేయ్ బుజ్జిగా...’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం . ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.  రాజ్‌ తరుణ్‌ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా బ్యానర్ లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’,  ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు, మా బ్యానర్ కు తప్పకుండా మా ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ చాలా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది” అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Orey Bujjigaa Movie First Look Released:

Raj Tarun Orey Bujjigaa First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ