Advertisementt

బన్నీ-సుక్కు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా?

Mon 10th Feb 2020 11:53 AM
thaman,devisriprasad,  బన్నీ-సుక్కు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా?
is bunny wants to change music director ? బన్నీ-సుక్కు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా?
Advertisement
Ads by CJ

బన్నీ అల వైకుంఠపురములో సినిమా విజయంతో మంచి హుషారు మీద ఉన్నాడు. బన్నీ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికి బన్ని ఇంకా జాయిన్ అవలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే కొన్ని రోజులుగా దేవి శ్రీ ప్రసాద్ స్థానంలో థమన్ వస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 

అల వైకుంఠపురములో సినిమాకి థమన్ అందించిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. దాంతో బన్నీ తన తర్వాతి సినిమాకి కూడా థమన్ నే తీసుకోవాలని సుక్కూతో చెప్పాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతమేరకు నిజమన్నది మాత్రం తెలియదు. అయితే థమన్ ఫామ్ లో ఉన్నమాట నిజమే. కానీ దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా పాటలు  సంచలనం సృష్టించాయి. అదీ గాక సుక్కూకి, దేవికి మధ్య మంచి స్నేహం ఉంది.

 

మరి ఆ స్నేహాన్ని కాదనుకుని బన్నీ చెప్పాడని థమన్ ని తీసుకుంటాడా అని ఆలోచిస్తున్నారు. అయితే మరో వాదన ఏంటంటే, ఆల్రెడీ బన్నీ-సుక్కూ సినిమా కి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ జరిగాయట. దేవి శ్రీ రెండు పాటల ట్యూన్లు కూడా ఇచ్చాడట. మరి ఇలాంటి టైమ్ లో సుక్కూ ఎందుకు మారుస్తాడని అంటున్నారు. ఆల్రెడీ పాటలు కూడా రికార్డ్ అయితే ఇంకెలా మారుస్తారని.. బన్నీ మార్చమన్నారని చెప్పడం కేవలం పుకార్లు మాత్రమేనని చెప్తున్నారు.

is bunny wants to change music director ?:

Bunny sukumar movie director