సినిమా ఇండస్ట్రీలో విజయం ఉంటేనే ఎవ్వరైనా మన దగ్గరికి వస్తారు. సక్సెస్ లో ఉన్నప్పుడు ఎంతో దగ్గరగా ఉండే వాళ్ళు కూడా ఫెయిల్యూర్ ఎదురైతే దూరంగా వెళ్ళిపోతారు. యంగ్ హీరో శర్వానంద్ గతంలో వరుస విజయాలతో జోరు మీద ఉండేవాడు. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా శతమానం భవతి మొదలగు విజయాలతో మంచి జోష్ లో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా అతడికి విజయం దూరమైంది. వరుసగా నాలుగు సినిమాలు చేస్తే అందులో ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు తప్పితే మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. మొన్నటికి మొన్న రణరంగం పేరుతో వచ్చిన సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో శర్వా మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఒకప్పుడు తనకి మంచి ఇమేజ్ ఉండేది. అది కాస్తా మూడు సినిమాల ఫెయిల్యూర్ తో పూర్తిగా పోయింది. దాంతో దర్శక నిర్మాతలు శర్వాతో సినిమా అంటే భయపడే స్థితికి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఆ భయం నుండి కొద్దిగా కోలుకున్నాడు.
దానికి కారణం జాను. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్నికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని క్లాసిక్ గా మిగిలిన 96 సినిమాను తెలుగులో "జాను" అనే పేరుతొ తెరకెక్కించారు. సమంత, శర్వానంద్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంటంది. అలాగే ఈ సినిమాలో సర్వా నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. అటు నటన పరంగా, సినిమా పరంగా పాజిటివ్ రివ్యూస్ రావడంతో హమ్మయ్య విజయం దక్కిందని ఊపిరి పీల్చుకుంటున్నాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత శర్వాకి మంచి హిట్ లభించిందనే చెప్పాలి.