Advertisementt

పవన్‌తో నటిస్తారా అని అలీని అడగ్గా...!

Mon 10th Feb 2020 02:27 PM
ali,comedian ali,pawan kalyan,pawan-ali,pink remake  పవన్‌తో నటిస్తారా అని అలీని అడగ్గా...!
Ali Gives Clarity Over.. Acting With Pawan పవన్‌తో నటిస్తారా అని అలీని అడగ్గా...!
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవన్ కల్యాణ్-కమెడియన్ అలీకి ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్.. అదేదో సామెత ఉంది కదా ‘తమ్ముడు తమ్ముడే...’ అన్నట్లుగా రాజకీయాల్లోకి వచ్చే సరికి ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం పూర్తిగా చెడిపోయింది. మళ్లీ ఇద్దరూ ఒక్కటవ్వాలని ఫ్యాన్స్ కోరుకున్నప్పటికీ అది జరగలేదు. అయితే.. తాజాగా ఇద్దరూ ఒక్క సినిమాలో నటించాలని అనుకుంటున్నారని.. పవన్ నుంచి అలీకి పిలుపు వెళ్లిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజమెంత..? అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఆరాతీసింది.

నేను రెడీ..!

పవన్ సినిమాల్లో అవకాశమొచ్చింది విన్నాం.. ఇందులో నిజమెంత’ అని ఆంగ్ల పత్రిక రిపోర్టర్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ‘రాజకీయాలు వేరు సినిమాలు వేరు.. పవన్‌తో నటించడానికి నాకెలాంటి ఇబ్బంది లేదు. ఆయనతో కలిసి నటించడానికి నేరు రెడీగానే ఉన్నాను. నన్ను అయితే ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ సినిమాలో చేసే అవకాశం వస్తే మాత్రం నేను రెడీ. రాజకీయాలు వేరు.. సినిమాలు, వ్యకిగత జీవితాలు వేరుఅని అలీ క్లారిటీగా చెప్పాడు. సో.. దీన్ని బట్టి చూస్తే అలీ రెడీగా ఉన్నాడన్న మాట. మరి ‘పింక్’ రీమేక్‌లో అవకాశం రాకపోయినప్పటికీ క్రిష్ సినిమాలో అయినా అలీకి అవకాశం వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Ali Gives Clarity Over.. Acting With Pawan:

Ali Gives Clarity Over.. Acting With Pawan  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ