Advertisementt

మహేశ్‌ను ఫాలో అవుతున్న పవన్ కల్యాణ్!

Mon 10th Feb 2020 02:05 PM
pawan kalyan,mahesh babu,follow,superstar mehesh,power star pawan  మహేశ్‌ను ఫాలో అవుతున్న పవన్ కల్యాణ్!
Pawan Follows Mahesh.. Details Here..!! మహేశ్‌ను ఫాలో అవుతున్న పవన్ కల్యాణ్!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సూపర్ స్టార్ మహేశ్ బాబును ఫాలో అవుతున్నాడట. అదేంటి ఆయన స్టార్ హీరో కదా.. మహేశ్‌ను ఫాలో అవ్వాల్సిన అవసరమేంటి..? అని అనుకుంటున్నారా.. మీరనుకున్నట్లుగా నటన కాదు.. సినిమాల్లో అస్సలే కాదండోయ్.. పారితోషికం విషయంలోనండోయ్. ఇంతకీ ఆ లెక్కలేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

మహేశ్ బాబు ఈ మధ్య తాను నటించిన సినిమాలకు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు కూడా ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదని.. లాభాల్లో వాటా మాత్రమే తీసుకున్నాడని.. గట్టిగానే ఆయనకు ముట్టిందని వార్తలు వచ్చాయి. అయితే పవన్‌ కూడా ఇలాగే మహేశ్‌ను ఫాలో అవ్వాలని ఫిక్సయ్యాడట. 

‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్.. ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా మాత్రమే తీసుకుంటానని దర్శకనిర్మాతలకు చెప్పాడట. అయితే ఇప్పటికే ఆయనకు సకల సౌకర్యాలు అనగా తిరగడానికి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చినప్పటికీ మరీ ఇలా వాటాలు అంటే ఇబ్బందేమోనని చెప్పారట. అయితే తీరా ఆలోచించి పవన్ చెప్పినట్లే నిర్మాత ఓకే అనేశాడట. ఇదే వర్కవుట్ అయితే మాత్రం పవన్‌కు 50 నుంచి 70 కోట్లు వరకు ముట్టుతుందని టాక్ నడుస్తోంది. సో.. మహేశ్ సెట్ చేసిన ట్రెండ్‌ను పవన్ ఫాలో అయిపోతున్నాడన్న మాట. మరి రీమేక్ సినిమా ఏ మాత్రం ఆడుతుందో..? దానికి ఏ మాత్రం కాసులొస్తాయో..? పవన్‌కు ఎంత ముట్టుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Pawan Follows Mahesh.. Details Here..!!:

Pawan Follows Mahesh.. Details Here..!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ