Advertisementt

ఎవరికేం చెప్పాలో పవన్‌కు దిక్కుతోచట్లేదట!

Mon 10th Feb 2020 01:56 PM
pawan,pawan kalyan,confusion,two directors,pink remake  ఎవరికేం చెప్పాలో పవన్‌కు దిక్కుతోచట్లేదట!
Pawan Kalyan Confusion Over Two Directors! ఎవరికేం చెప్పాలో పవన్‌కు దిక్కుతోచట్లేదట!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా షూరు అయిపోయింది. అంతేకాదు తర్వాతి సినిమాకు క్రిష్‌తో కూడా పవన్ కమిట్ అయ్యాడు. అందుకే గెటప్ మొత్తం మార్చేశాడు పవన్. ఈ రెండు సినిమాలు అయిన తర్వాత తనకు భారీ హిట్టిచ్చిన హరీశ్ శంకర్‌తో సినిమా ఉంటుందని సమాచారం. హరీశ్‌-పవన్ కాంబోలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది కానీ ఎప్పుడు..? ఏ సినిమా తర్వాత అనేది మాత్రం తెలియరాలేదు.

వాస్తవానికి పవన్ మొత్తం ఐదు సినిమాలకు కమిట్ అయ్యాడని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. ఆ ఐదులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా కూడా ఉందట. అయితే క్రిష్ సినిమా పూర్తవ్వగానే ఆయన ఎవరితో నటించాలి..? ఏ డైరెక్టర్‌కు ఓకే చెప్పాలన్నది దిక్కుతోచట్లేదట. ఎందుకంటే హరీశ్ శంకర్.. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ డూపర్ హిట్టిచ్చి తన రేంజ్‌ను పెంచేశాడు. మరోవైపు త్రివిక్రమ్.. ఆయనకు బెస్ట్ ఫ్రెండ్.. పైగా ఇదివరకు మంచి హిట్లిచ్చిన డైరెక్టర్. దీంతో ‘హిట్టిచ్చిన’ డైరెక్టర్‌కు ఓకే చెప్పాలా లేకుంటే ‘హిట్లిచ్చిన’ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా..? ఎవరికేం చెప్పాలో అస్సలు పవన్‌కు దిక్కుతోచట్లేదట. 

ఇవన్నీ అటుంచితే సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ హిట్టవ్వడంతో త్రివిక్రమ్ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో మాటల మాంత్రికుడితోనే తీస్తే బాగుంటుందని ఒక్కోసారి పవన్‌కు అనిపిస్తోందట. అంతేకాదు.. పవన్ రీ ఎంట్రీ ఇస్తే మళ్లీ మాటల మాంత్రికుడి సినిమాతోనే అని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయ్. అంతేకాదు అదుగో ఇవాళ రేపు అధికారికంగా ప్రకటన కూడా ఉంటుందని వార్తలు గుప్పుమన్నాయ్. మరి ఫైనల్‌కు పవన్ ఎవరికి షాకిచ్చి.. ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఏంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు..!

Pawan Kalyan Confusion Over Two Directors!:

Pawan Kalyan Confusion Over Two Directors!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ