Advertisementt

సమంతకు పండంటి బిడ్డ పుట్టాలి..!

Mon 10th Feb 2020 03:29 AM
sam,samantha,actress samantha,child,chai-sam  సమంతకు పండంటి బిడ్డ పుట్టాలి..!
News About Star Actress Samantha సమంతకు పండంటి బిడ్డ పుట్టాలి..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. తాజాగా ‘జాను’గా వచ్చి అందర్నీ అలరించింది. వాస్తవానికి ఇప్పటికే తన నటనకు అభిమానులతో వందకు వంద కంటే పైనే మార్కులేయించుకుంది. ‘జాను’ సినిమాతో ఇక అందరికీ స్కూల్, కాలేజ్ రోజుల్లోని ప్రేమను గుర్తు చేసింది. ఈ సినిమా సామ్‌కు కెరీర్‌లో మరో మెట్టు ఎక్కించిందని చెప్పుకోవచ్చు. సినిమా సక్సెస్ అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకునే ఈ బ్యూటీ.. ఇటీవల కొండెక్కింది. కాలి నడకన ‘జాను’ చిత్రబృందం శ్రీవారిని దర్శించుకుంది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు పవన్ వీరాభిమానులకు ‘పింక్’ ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్స్ చెప్పేశాడు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతుండగా అభిమానులు ఆమెకోసం క్యూ కట్టారు. అయితే.. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫ్యాన్స్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వగా.. వారు ఆమెకు ‘జాను’ సక్సెస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. పాపం.. ఓ వీరాభిమాని మాత్రం ‘సమంతకు త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలి’ అని సామ్‌ను బ్లెస్ చేశాడు. ఆ కుర్రాడి మాటలకు రియాక్షన్ కూడా ఇచ్చిందోయ్. సామ్ సిగ్గుతో అలాగే నవ్వుతూ.. ఉండిపోయింది. సిగ్గుల మొగ్గైన సామ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. సామ్ తల్లి అయితే చూడాలని ఆ అభిమానికి ఎంత కోరిక ఉందో.. మరి ఇదెప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే.

News About Star Actress Samantha:

News About Star Actress Samantha  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ