ఈ శుక్రవారం విడుదలైన దిల్ రాజు - సమంత - శర్వానంద్ ల జాను సినిమాకి హిట్ టాక్ వచ్చింది. జాను సినిమాని చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ అంతా జాను సినిమాకి పాజిటివ్ టాక్ ఇచ్చారు. సినిమాలో చిన్న మైనర్ మిస్టేక్స్ తప్ప సినిమా ఓవరాల్ గా బావుందని అంటూ ముక్తఖంఠంతో చెప్పారు. మొదటి నుండి దిల్ రాజు నమ్మకమే నిజమైంది. జాను సినిమాతో ఎలాగైనా హిట్ కొడతానని దిల్ రాజు బలంగా నమ్మాడు. సినిమాలో స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టినప్పటి... ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగానే నచ్చింది. 96 దర్శకుడే ఈ సినిమాని రీమేక్ చెయ్యడంతో 96 ఫీల్ మిస్ అవకుండా జానుని తెరపైకి తెచ్చాడు. చిన్న చిన్న మార్పులతో తెలుగు ప్రేక్షకులను దర్శకుడు ప్రేమ్ కుమార్ మెప్పించాడు. అయితే సినిమాకి వచ్చిన టాక్ కి వచ్చిన కలెక్షన్స్ కి సంబంధమే లేదు.
ఈ సినిమాకి ఓపెనింగ్స్ అనుకున్నంతగా రాలేదు. దిల్ రాజు నమ్మకాన్ని జాను ఒమ్ము చేయలేదు కానీ ఇలాంటి సినిమాలు కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కే ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. బిసి సెంటర్స్ ఆడియన్స్ కి ఒక ఫైట్ ఒక రొమాంటిక్ సాంగ్ ఉండాలి కానీ స్లోగా సాగే లవ్ స్టోరీస్ కి కనెక్ట్ కారు. అందులోను జాను సినిమా కాస్త స్లోగా ఉండడం కూడా బిసి సెంటర్స్ ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే సినిమాకి హిట్ టాక్ పడినా కలెక్షన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. లేదంటే 96 సినిమాపై ఉన్న క్రేజ్ తో జానుకి బెస్ట్ ఓపెనింగ్స్ పడేవి. ఇక శనివారం కూడా జాను ఓపెనింగ్స్ అంతగా పెరగలేదు. అందులోను ఫిబ్రవరి పరీక్షల సీజన్ వలన స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ ఫీవర్ లో ఉంటారు కాబట్టి పేరెంట్స్ కి టెన్షన్స్. ఇలాంటి టైంలో థియేటర్స్‌కి ప్రేక్షకులు రావడం కష్టమే.