Advertisementt

విజయ్.. లాస్ట్ లవ్ స్టోరీపై పునరాలోచన చెయ్!

Mon 10th Feb 2020 03:14 AM
raashi khanna,vijay deverakonda,world famous lover,last lover story  విజయ్.. లాస్ట్ లవ్ స్టోరీపై పునరాలోచన చెయ్!
Raashi Khanna Reaction on Vijay Deverakonda Last Love Story విజయ్.. లాస్ట్ లవ్ స్టోరీపై పునరాలోచన చెయ్!
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికో.. లేదంటే నిజంగానే లవ్ స్టోరీస్ చెయ్యడం ఆపేస్తాడో కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమానే తనకి లాస్ట్ లవ్ స్టోరీ అని చెప్పి అందరికి షాకిచ్చాడు. రెండు మూడు లవ్ స్టోరీస్ మాత్రమే చేసిన విజయ్ దేవరకొండకి అప్పుడే లవర్ బాయ్ కేరెక్టర్స్ మొహం మొట్టాయా కుర్రోడు మాస్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నాడులే అందుకే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని అన్నారు. అలాగే ఇండస్ట్రీ మొత్తం విజయ్ స్టేట్మెంట్ చూసి షాకయ్యింది కూడా.

తాజాగా విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ అని ఇచ్చిన స్టేట్మెంట్ చూసి హీరోయిన్స్ కలవరపాటుకు గురవుతున్నారు. విజయ్ దేవరకొండతో నటించాలని చాలామంది హీరోయిన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అది విజయ్ లవ్ స్టోరీస్ చేస్తేనే సాధ్యమవుతుంది. అదే మాస్ హీరోగా మారితే అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ మీదే ఉంటుంది కానీ.. హీరోయిన్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. అదే లవ్ స్టోరీస్ చేస్తే విజయ్ తో పాటుగా తమకి పేరొస్తుంది. మరి విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ లో నలుగురు హీరోయిన్స్ తో జత కట్టి ఇప్పుడు లాస్ట్ లవ్ స్టోరీ అంటూ షాకివ్వగానే ముందు ఆ సినిమా హీరోయిన్ రాశి ఖన్నానే తప్పుబడుతుంది.

అభిమానులు, ప్రేక్షకులు విజయ్ ని ఇంకా ప్రేమకథ చిత్రాల్లో చూడాలనుకుంటున్నారని కానీ విజయ్ ఇలా అనడం బాగోలేదని అయితే విజయ్ ముందుముందు లవ్ స్టోరీస్ చేయడంపై పునరాలోచిస్తాడనే నమ్మకం తనకుందని అంటుంది.

Raashi Khanna Reaction on Vijay Deverakonda Last Love Story:

Raashi Khanna Suggestion to Rowdy Star

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ