Advertisementt

‘వలయం’ ట్రైలర్ వదిలిన అడివి శేష్

Mon 10th Feb 2020 12:22 AM
adivi sesh,valayam trailer,laksh,valayam movie trailer  ‘వలయం’ ట్రైలర్ వదిలిన అడివి శేష్
Valayam movie trailer released ‘వలయం’ ట్రైలర్ వదిలిన అడివి శేష్
Advertisement
Ads by CJ

లక్ష్ హీరోగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం’. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దిగంగన సూర్యవంశీ నాయికగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో హీరో అడివి శేష్ ‘వలయం’ ట్రైలర్ ను ఆవిష్కరించారు.

సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేను 20 సినిమాలు డైరెక్ట్ చేస్తే, వాటిలో 5 సినిమాలు ఈ బ్యానర్ లోనే చేశాను. లక్ష్ బార్న్ ఆర్టిస్ట్. నేను డైరెక్ట్ చేసిన ‘రిక్షా రుద్రయ్య’ లోనే తను తొలిసారి నటించాడు. ‘వలయం’ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా అన్నారు.

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ, ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ కొత్తగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది. లక్ష్ కొత్తగా కనిపిస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అతను డెడికేషన్ ఉన్న నటుడు. ‘వలయం’ బాగా ఆడి నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

ఈ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు, హీరో లక్ష్ కు థాంక్స్ చెప్పుకుంటున్నానని డైరెక్టర్ రమేష్ కడుముల తెలిపారు.

నటుడు రవిప్రకాశ్ మాట్లాడుతూ అంతా తానే అయ్యి, ఈ సినిమాని లక్ష్ నిర్మించారనీ, ఒక జెన్యూన్ ఫిలింగా ‘వలయం’ను దర్శకుడు రూపొందించారనీ అన్నారు. లక్ష్ చాలా బాగా నటించాడన్నారు.

డైరెక్టర్ నాగు గవర మాట్లాడుతూ, లక్ష్ ఒక విజనరీ యాక్టర్ అనీ, ‘వలయం’ ఆయనకు కంబ్యాక్ లాంటి సినిమా అనీ అన్నారు.

డైరెక్టర్ చంద్రమహేష్ మాట్లాడుతూ ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా రెండు బాధ్యతల్ని ఈ సినిమాతో లక్ష్ చక్కగా నిర్వర్తించాడని చెప్పారు. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయన్నారు.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, ఇది సూపర్బ్ కాన్సెప్ట్ తో చేసిన సినిమా. సస్పెన్స్, థ్రిల్లింగ్, లవ్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ రమేష్ చాలా బాగా తీశారు. ఆయన చాలా క్లారిటీ, మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. లక్ష్ క్యారెక్టర్ తో పాటు ప్రతి క్యారెక్టర్ కూ ఈ సినిమాలో ప్రాముఖ్యం ఉంటుంది. తప్పకుండా సినిమా ఆడుతుందని ఆశిస్తున్నా అన్నారు.

చిత్ర సమర్పకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోసాని కృష్ణమురళికి రైటర్‌గా మా బేనర్‌లోనే ‘అడవి దొర’, ‘వాల్మీకి’ సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చాను. కె.ఎస్. నాగేశ్వరరావు మేం నిర్మించిన ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అదే సినిమాలో మా అబ్బాయి హీరో తమ్ముడిగా నటించాడు. మేం రిలీజ్ చేసిన ‘బిచ్చగాడు’ 20 ఏళ్ల కాలంలో అత్యధిక మార్జిన్‌తో కలెక్షన్లు వసూలు చేసిన సినిమా. లక్ష్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకుంటే సంతోషమే కానీ మంచి కొడుకుగా ఉంటే ఇంకా సంతోషం. అతను అడివి శేష్ లాగా సక్సెస్ అవుతాడని ఆశిస్తున్నా అన్నారు.

హీరో లక్ష్ మాట్లాడుతూ, నేను శశికాంత్ గా ప్రేక్షకులకు ఇంతదాకా తెలుసు. ఇప్పుడు లక్ష్ గా మీ ముందుకు వస్తున్నా. నేను స్పోర్ట్స్ ఆడేవాడ్ని కాబట్టి టీం ఎఫర్ట్ అనేది ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘వలయం’ అనేది నా ఒక్కడి సినిమా కాదు. మా టీం అంతా ఎంతో కష్టపడితే వచ్చిన సినిమా. మా నాన్న నాకో చాన్స్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ లేకపోతే మళ్లీ ఇలా వచ్చేవాడ్ని కాదు. ఈ నెల 21న సినిమాని విడుదల చేస్తున్నాం. ఈసారి సక్సెస్ అవుతానని ఆశిస్తున్నా. నా ఫ్రెండ్ శేష్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ, లక్ష్ నాకు మొదట నైబర్. తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఒక డ్రీమ్ ఉండటం, ఒక ప్యాషన్ తో పాటు ఒక  పెయిన్ ఉండటం, ఆ పెయిన్ తో పనిచేయటం, వాటి ఫలితం, పడిపోవటం.. ఆ అనుభవాలన్నీ నాకు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను ఫ్రెండ్షిప్, రిలేషన్స్ కన్నా కూడా ప్యాషన్ నే ఎక్కువ నమ్ముతాను. ఆ ప్యాషన్ ఉన్నప్పుడే మనందరం ఉంటాం అనేది నా నమ్మకం. ఆ ప్యాషన్ లక్ష్ లో ఉంది. అది ట్రైలర్ లో కనిపించింది. జెన్యూన్ గా ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నా అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నటులు నోయల్, రఘురాం శ్రీపాద, సినిమాటోగ్రాఫర్ రామకృష్ణ కూడా మాట్లాడారు.

తారాగణం: లక్ష్, దిగంగన సూర్యవంశీ, రవిప్రకాష్, నోయల్, రవివర్మ, చిత్రం శ్రీను, కిరీటి, రఘురాం శ్రీపాద, కృష్ణేశ్వరరావు

సాంకేతిక బృందం: సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్, ఎడిటింగ్: ఉపేంద్ర, ఆర్ట్: బ్రహ్మ కడలి, పీఆర్వో: వంశీ-శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ అక్కినేని, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాత: పద్మావతి చదలవాడ, దర్శకుడు: రమేష్ కడుముల, బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్, రిలీజ్ డేట్: 21 ఫిబ్రవరి 2020

Valayam movie trailer released:

Adivi sesh launches valayam trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ