ఆ డైరెక్టర్‌తో అస్సలు సినిమా చేయనంటున్న బన్నీ!
Allu Arjun Not Interested Movie With Young Directorఅవును మీరు వింటున్నది నిజమే. ఆ డైరెక్టర్‌తో బన్నీ అస్సలు సినిమాలు చేయకూడదని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యాడట. ఎందుకంటే తన ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలో ఆయన చేసిన హడావుడే అందుకు కారణమట. ఈ చిన్న క్లూతో అర్థమయ్యే ఉంటుందిగా.. ఆయన మరెవరో కాదండోయ్.. యంగ్ డైరెక్టర్, హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి అట. ఇంతకీ వీళ్లద్దరికీ ఏం జరిగింది..? ఆయనతో సినిమా చేయకూడదని బన్నీ ఎందుకు అనుకున్నాడనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అనీల్ రావిపూడి మాంచి ఊపుమీదున్నాడు. వాస్తవానికి ‘ఎఫ్-2’ సినిమా తర్వాత అనిల్‌తో పనిచేయాలని చాలా మంది హీరోలు అనుకున్నారు. అప్పట్లో బన్నీ కూడా అనుకున్నాడట. అయితే ఇప్పుడు మాత్రం అస్సలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల ప్రమోషన్లు మొదలుకుని రిలీజ్ వరకూ ఏ రేంజ్‌లో పోటీ పడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాస్తవానికి బన్నీ ‘అల’ కంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ మాత్రం చాలా స్లోగానే నడిచింది. ఫస్ట్ లుక్ మొదలుకుని సాంగ్స్ రిలీజ్ వరకూ ‘అల’ అలా
దూసుకెళ్లింది. అయితే ‘సరిలేరు’ చిత్రబృందం కాస్త సైలెంట్‌గానే ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ.. అనీల్ మాత్రం అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడని బన్నీ అనుకుంటున్నాడట. అంతేకాదు.. మొదట్లో అనీల్ రిలీజ్ చేసిన వీడియో తనను ఉద్దేశించినదేనని భావించిన బన్నీ.. ఇక అస్సలు ఆ డైరెక్టర్‌తో కలిసి పనిచేయకూడదని ఫిక్సయ్యాడట. ఈ విషయం తన సన్నిహితులతో బన్నీ చెప్పాడట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అటు బన్నీ గానీ.. ఇటు అనిల్ గానీ రియాక్ట్ అవ్వాల్సిందే.
Allu Arjun Sensational Comments on Anil Ravipudi






































