సినీ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో శృంగార సినిమాలతో హడావుడి చేసిన తార షకీలా కనుమరుగై ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆపసోపాలు పడుతోంది. అయితే.. ‘లేడీస్ నాట్ అలౌడ్’ చిత్రంతో నిర్మాతగా అవతారమెత్తిన ఈ భామ మళ్లీ ఫామ్‌లోకి రావాలని తహతహలాడుతోంది. రీ ఎంట్రీ చిత్రానికే సెన్సార్ ఊహించని షాకివ్వడంతో కొన్ని నెలల పాటు మళ్లీ కనిపించలేదు. ఇక ఆ సినిమా అస్సలు రిలీజ్ అవుతుందో లేదో అని మళ్లీ ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’తో అయినా వర్కవుట్ అవుతుందేమో అని భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యే ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి హడావుడి చేసిన ఈ భామ తాజాగా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి అడగ్గా.. ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రశ్న: టాలీవుడ్ అగ్ర హీరోల గురించి ఒక్క ముక్కలో చెప్పండి..!? అని ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది.
షకీలా : ‘మహేశ్ బాబు నాకు బ్రదర్ లాంటివాడు. జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్’ అని చెప్పుకొచ్చింది.
ప్రశ్న: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పండి!?
షకీలా : అల్లు అర్జునా.. ఆయనెవరు..? ‘బన్నీ ఎవరో నాకు తెలియదు’ అని ఆశ్చర్యంగా సమాధానమిచ్చింది.
కాగా.. షకీలా సమాధానంతో విస్మయానికి లోనైన సదరు యాంకర్ ఇక ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయకూడదని భావించి తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయాడు. అయితే.. బన్నీ తెలియకపోవడమేంటి..? ఆయన టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరన్న విషయం షకీలాకు తెలియదా..? అని వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా షకీలాపై ఓ వైపు మెగాభిమానులు, మరోవైపు బన్నీ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. మరికొందరైతే షకీలా సమాధానంలో తప్పేముంది..? ఆమె ఎంతో నిజాయతీగా పరిచయం లేదన్న కోణంలో చెప్పివుంటుదని ఎందుకు అనుకోవట్లేదు..? అని మండిపడుతున్నారు.