Advertisementt

మాట నిలబెట్టుకున్న మెగా పవర్‌స్టార్ చెర్రీ!

Sun 09th Feb 2020 11:21 PM
mega power star,mega fans,ramcharan,noor family,10 lakhs  మాట నిలబెట్టుకున్న మెగా పవర్‌స్టార్ చెర్రీ!
News About Mega Power Star Ramcharan!! మాట నిలబెట్టుకున్న మెగా పవర్‌స్టార్ చెర్రీ!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షుడిగా పనిచేసిన నూర్ మహ్మద్ డిసెంబర్-8న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగా హీరోలు ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఆ టైమ్‌లో చెర్రీ హైదరాబాద్‌లో లేకపోవడంతో కార్యక్రమాలకు వెళ్లలేకపోయాడు. దీంతో నూర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఓ భావోద్వేగ ప్రకటనను ఆయన విడుదల చేశాడు. అంతేకాదు.. నూర్ కుటుంబీకులను అన్ని విధాలా ఆదుకుంటామని.. రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. 

మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్!

అయితే.. నాటి నుంచి నేటి వరకూ హైదరాబాద్‌లో లేని ఆయన ఇవాళ అనగా.. ఆదివారం నాడు సిటీకి వచ్చాడు. ఈ సందర్భంగా నూర్ కుటుంబీకులను తన ఇంటికి పిలింపించుకున్న చెర్రీ వారిని ఓదార్చాడు. వారితో కలిసి సుమారు 45 నిమిషాల పాటు గడిపిన మెగా హీరో.. అనంతరం పదిలక్షల రూపాయిల చెక్‌ను వారికి అందజేశాడు. ఈ సందర్భంగా నూర్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని చెర్రీ.. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చాడు. అంతేకాదు.. నూర్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని.. అమ్మాయిల పెళ్లిళ్లకు స్వయంగా వస్తానని చెర్రీ భరోసా ఇచ్చాడు. మీ ఇంట్లో పెద్ద కొడుకులా అన్ని విధాలా అండగా ఉంటానని రామ్‌చరణ్.. నూర్ కుటుంబానికి హామీ ఇచ్చాడు.

News About Mega Power Star Ramcharan!!:

News About Mega Power Star Ramcharan!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ