Advertisementt

రజనీ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌కు ఛాన్స్!!

Sat 08th Feb 2020 08:51 PM
super star rajanikanth,bigg boss 3 winner,telugu biggboss,rahul sipligung,rajinikanth  రజనీ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌కు ఛాన్స్!!
Bigg boss 3 winner Rahul sipligung Acts Rajinikanth Movie! రజనీ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌కు ఛాన్స్!!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో బంపరాఫర్ వచ్చింది. ఓహ్ సింగర్ కదా.. పాటలు పాడమని ఆఫరిచ్చారేమో అని అనుకుంటున్నారు.. అస్సలు కాదండోయ్ బాబూ.. ఓ ముఖ్య పాత్రలో నటించడానికి మాత్రమేననట. ఇంతకీ ఏ సినిమాలో పాత్రకు రాహుల్‌ను ఆయన సంప్రదించాడు..? ఆయన సింగర్ కదా నటించడమేంటి..? ఈ ఆఫర్ వచ్చినందుకు ఆయన ఎలా ఫీలవుతున్నాడు..? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రజనీకాంత్, మీనా, ఖుష్బూ నటీనటులుగా శివ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించడానికి రాహుల్ సిప్లిగంజ్‌‌ నటించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రజనీతో దిగాన ఫొటోను సోషల్ మీడియా ద్వారా రాహుల్ పంచుకున్నాడు. దీంతో ఇంతకీ రాహుల్ ఆయన సినిమాలో నటిస్తున్నాడా..? లేకుంటే ఆయన సినిమాలో సింగర్‌గానా..? పెద్దాయనతో ఫొటో మాత్రమే దిగాడా..? అనేది తెలియరాలేదు కానీ.. ఈ ఫొటోను బట్టి వార్తలు మాత్రం రకరకాలుగా వచ్చేస్తున్నాయి.

కాగా.. ఇదివరకే రాహుల్‌కు కృష్ణవంశీ పిలిచి మరీ కృష్ణవంశీ అవకాశమిచ్చాడు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో రాహుల్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తనకు సినిమాల్లో నటించే అవకాశమొస్తే.. మరీ ముఖ్యంగా పునర్నవీ తాను కలిసి హీరో హీరోలుగా నటించాలని ఉందని పలు సందర్భాల్లో రాహుల్ తన మనసులో మాటను బయటపెట్టిన విషయం విదితమే.

Bigg boss 3 winner Rahul sipligung Acts Rajinikanth Movie!:

Bigg boss 3 winner Rahul sipligung Acts Rajinikanth Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ