Advertisementt

‘నిశ్శ‌బ్దం’గా ఏప్రిల్ 2కి వెళ్లిపోయింది

Sat 08th Feb 2020 07:55 PM
nishabdham movie,anushka shetty,release date,april 2nd  ‘నిశ్శ‌బ్దం’గా ఏప్రిల్ 2కి వెళ్లిపోయింది
Nishabdham Movie Release Details ‘నిశ్శ‌బ్దం’గా ఏప్రిల్ 2కి వెళ్లిపోయింది
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’

‘అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే డిఫ‌రెంట్ పాత్ర‌లో అనుష్క మెప్పించ‌నున్నారు. అలాగే మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల, మైకేల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర‌ల లుక్స్‌తో పాటు ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది.

నటీనటులు:

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్  త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

సంగీతం:  గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్,  స్టోరీ,  డైరెక్ష‌న్ - హేమంత్ మ‌ధుక‌ర్.

Nishabdham Movie Release Details:

Nishabdham Movie Release on April 2nd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ