మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చాలా ప్రయత్నాలే చేసింది. కానీ అమ్మడు ప్రయత్నాలు ఆదిలోనే హంస పాదులా బెడిసి కొట్టాయి. హ్యాపీ వెడ్డింగ్ తరవాత సూర్యకాంతం సినిమా కూడా దెబ్బేయ్యడంతో నిహారిక హీరోయిన్ వేషాలకి దూరమయ్యిందో, అసలు మెగా డాటర్ తో మనకెందుకులే అని దర్శకనిర్మాతలు సైడ్ అయ్యారో తెలియదు కానీ.. నిహారికకి సినిమా ఛాన్స్ లే లేవు. అయినా నిహారిక వెబ్ సిరీస్ తో బాగా బిజీ. మరోపక్క హీరోయిన్ వేషాలకి స్వస్తి చెప్పింది. అందుకే సినిమాల విషయంలో నిహారిక చాలా లైట్ అంటున్నారు. కానీ పాప తీరు చూస్తుంటే అలా లేదు.
అసలు మెగా ఫ్యామిలీ అమ్మాయేనా ఈ నిహారిక అన్న రేంజ్ లో ఫొటో షూట్స్ చేస్తూ... దర్శకనిర్మాతలకు సవాల్ విసురుతుంది. మెగా డాటర్ అనేగా నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు చూడండి అంటూ బుల్లి బుల్లి ఫ్రాక్ లతోను, ఎద అందాలు కనబడేలా డ్రెస్ లు వేసుకుని... హాట్ హాట్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి నిహారిక హాటెస్ట్ గ్లామర్ షో చూసాక మెగా ఫ్యామిలీ అమ్మాయితో మనకెందుకు అనుకుంటారో? లేదంటే టాలెంట్ ఉంటే చాలు.. ఆ అమ్మాయి ఏ ఫ్యామిలీ అయితే మనకెందుకు అనుకుంటారో? చూడాలి. నిహారిక మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. అందుకే హాట్ గా స్పైసిగా మారిపోయి అందరిని కవ్విస్తుంది. మరి ముందే ఈ రేంజ్ అందాలు చూపిస్తే దర్శక నిర్మాతలెవరైనా పడేవారేమో. ఇప్పుడు ప్లాప్ హీరోయిన్ స్థానంలోకి వచ్చాక ఇలా హాట్ గా ట్రై చేస్తే లాభం కన్నా నష్టం ఉంటుందేమో చూడాలి. మరి నిహారిక ట్రైల్స్ చూస్తుంటే ఎవరన్నా ఈ మెగా డాటర్ ని పట్టించుకోండయ్యా అని అనాలనిపిస్తుంది. ఏమ్మా నిహారిక అంతే కదా..!