Advertisementt

అజయ్ దేవగన్ ‘RRR’ టీమ్‌కి షాకిచ్చాడుగా!

Sat 08th Feb 2020 02:28 PM
ajay devgan,shock,rrr team,remuneration,rajamouli  అజయ్ దేవగన్ ‘RRR’ టీమ్‌కి షాకిచ్చాడుగా!
Ajay Devgan Gives shock to RRR Team అజయ్ దేవగన్ ‘RRR’ టీమ్‌కి షాకిచ్చాడుగా!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో సహా తమిళం నుండి సముద్రఖని వరకు నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమాల్లో అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. హీరోలతో సమానమైన క్రేజ్ హీరోయిన్స్ కి, విలన్స్ కి కూడా ఉంటుంది. అయితే RRR మల్టీస్టారర్ కోసం రాజమౌళి బాలీవుడ్ నుండి ఓ కీలక పాత్ర కోసం అజయ్ ని తీసుకున్నారు. ఈ సినిమాలో అజయ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉంటుంది అని.. అయితే అజయ్ దేవగన్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఇచ్చినంత పారితోషకం ఉంటుంది అని ప్రచారం జరిగింది. అజయ్ బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో కాబట్టి.. ఎన్టీఆర్, చరణ్ ల పారితోషకం అంతే ఇస్తామన్నారట.

RRR  నిర్మాతలు అజయ్ దేవగన్ క్రేజ్ దృష్ట్యా 25 కోట్ల అందమైన పే చెక్‌ను ఆఫర్ చేసినప్పటికీ RRR నిర్మాతలను, యూనిట్ ఆశ్చర్యం కలిగించే విధంగా అజయ్ ఈ పారితోషకం ప్రతిపాదనను తిరస్కరించాడని, అసలు RRR కోసం పైసలు కూడా వసూలు చేయనని స్పష్టం చేసాడట. రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన కల అని, అది RRR తో నెరవేరిందని ఇంత గొప్ప సినిమాలో తనకు నటించే అవకాశం వచ్చినందుకు సంతోషించాలి కానీ డబ్బుతో దాన్ని పోల్చి చూడకూడదని చెప్పడంతో నిర్మాతలతో పాటుగా చిత్ర బృందం మొత్తం షాకయ్యిందట. మరి భారీ బడ్జెట్ సినిమాలో అజయ్ దేవగన్ అంతసేపు ఫ్రీగా నటించడం కేవలం రాజమౌళితో స్నేహం వలనే అంటున్నారు.

Ajay Devgan Gives shock to RRR Team:

No Remuneration to Ajay Devgan for RRR Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ