Advertisementt

కుర్రహీరోతో యాంగ్రీస్టార్.. మల్టీస్టారర్‌ మూవీ!?

Fri 07th Feb 2020 05:01 PM
angry star,rajasekhar,multistarrer movie,young hero  కుర్రహీరోతో యాంగ్రీస్టార్.. మల్టీస్టారర్‌ మూవీ!?
Angry Star Multistarrer Movie With Young Hero! కుర్రహీరోతో యాంగ్రీస్టార్.. మల్టీస్టారర్‌ మూవీ!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. అది కూడా కుర్ర హీరోలతో సినిమాలు సక్సెస్ అవుతుండటంతో సీనియర్లు అందరూ అదే బాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అదే పంథాలో ఇప్పుడు మరికొన్ని తెరకెక్కుతున్నాయ్ కూడా. అయితే తాను కూడా ఇదే బాట పట్టాలని అనుకున్న యాంగ్రీస్టార్ రాజశేఖర్.. మల్టీస్టారర్‌‌కు రెడీ అంటున్నాడు. వాస్తవానికి ప్రముఖ దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరితో రాజశేఖర్ సినిమా ఉంది. అయితే మొదట యాంగ్రీస్టార్ అనుకున్నప్పటికీ.. మల్టీస్టారర్ అయితే కచ్చితంగా వర్కవుట్ అవుతుందని అనుకున్న ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారట.

ఎవరైనా కుర్ర హీరోను తీసుకుని మల్టీస్టారర్ చేయాలని భావించారట. అందుకు మొదట శ్రీ విష్ణును అనుకోగా.. ఇంకా ఎవరెవరు రెడీగా ఉన్నారని ఆలోచించి ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయను కూడా లైన్‌లో పెట్టారట. వీరిద్దరిలో ఎవరూ ఓకే చెప్పినా సరే సినిమా త్వరలోనే పట్టాలెక్కించేద్దామని వీరభద్రమ్ రెడీగా ఉన్నారట. ఇప్పటికే వీరిద్దరూ కూడా మల్టీస్టారర్ నటించి మెప్పించిన వాళ్లే.. మరి ఇద్దరిలో ఫైనల్ ఎవరవుతారో ఏంటో.

కాగా.. ‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలతో ఊపు మీదున్న రాజశేఖర్ ఈసారి కూడా సూపర్ హిట్ కొట్టేసి.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. మరి మల్టీస్టారర్ మూవీ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? ఇంతకీ ఇది పుకారేనా..? లేకుంటే నిజమా అనేది కూడా తెలియరాలేదు. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే మరి.

Angry Star Multistarrer Movie With Young Hero!:

Angry Star Multistarrer Movie With Young Hero!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ