Advertisementt

పాటల వేడుకకు ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ రెడీ!

Fri 07th Feb 2020 12:16 AM
prabhu deva,krishna manohar ips,audio,release,february 15  పాటల వేడుకకు ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ రెడీ!
Krishna Manohar IPS Audio Release Date Fixed పాటల వేడుకకు ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ రెడీ!
Advertisement
Ads by CJ

పాటల విడుదల సన్నాహాల్లో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడిగా అలరారుతున్న ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రభుదేవా తొలిసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 21 న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 15న నిర్వహిస్తున్నారు.

తమిళంతోపాటు తెలుగులో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించిన ప్రభుదేవా తొలిసారి డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్  పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని, ఈ నెల 15న ఆడియో విడుదల చేసి, ఫిబ్రవరి 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఆర్.సీతారామరాజు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్!!

Krishna Manohar IPS Audio Release Date Fixed:

Krishna Manohar IPS Audio Release on Feb 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ