Advertisementt

మూడు రాజధానులపై షకీలా సెటైర్స్!

Fri 07th Feb 2020 12:14 AM
shakeela,shakeela rasina motta modhati kutumba katha chitram,3 capitals,andhra capitals  మూడు రాజధానులపై షకీలా సెటైర్స్!
Shakeela Satires on YS Jagan 3 Capitals మూడు రాజధానులపై షకీలా సెటైర్స్!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రాకు మూడు రాజధానులు అంటే షకీలా ఆశ్చర్యపోయింది.. అంతేకాదు.. ఒకే రాష్ట్రానికి ముగ్గురు సీఎంలు కూడా ఉంటారేమో సెటైరేసింది. ఇదంతా మీరు అనుకున్నట్లుగా రియల్‌గా కాదండోయ్ బాబూ.. రీల్ లైఫ్‌లో మాత్రమే. ఇంత డేర్‌గా రియల్ లైఫ్‌లో మాట్లాడితే షకీలా పరిస్థితి ఊహించుకోగలమా. ఇదంతా.. ప్రముఖ శృంగార తార షకీలా ప్రధాన పాత్రలో నటించిన ‘షకీలా తొలిసారిగా రాసిన కుటుంబ కథా చిత్రం’ టీజర్‌లో వ్యవహారమండోయ్.!

కనెక్టింగ్ కోసమేనా!?

ష‌కీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన  చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల వ్యవహారంను ప్రస్తావించారు. ఏపీలో దీనిపై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. అయితే హడావుడి సబ్జక్ట్‌ అయితే జనాలు కనెక్ట్ అవుతారేమోనని అనుకున్న చిత్రబృందం ఇలాంటి ప్రయత్నం చేసింది.

టీజర్‌లో ఏముంది!?

కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న షకీలా ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ అనే బ్యానర్ ఐటమ్ చూస్తుంది. అది చూసిన ఆమె ఏంటి.. ‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ ఒకింత ఆశ్చర్యపోతూ పక్కనే నిల్చుని ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. ‘అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేశారుగా’ అని చెబుతాడు. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? అంటే పోను పోను.. ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ షకీలా కాసింత పరిహాసమాడుతోంది. 

అయితే.. ఇప్పటికే ఈ టీజర్‌పై పలువురు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు కామెంట్ల రూపంలో తిట్టిపోస్తున్నారు. ఇది టీజర్‌ వరకే కదా నడుస్తుంది కానీ.. ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్స్ కానీ.. డైలాగ్స్ కానీ ఉంటే మాత్రం సినిమాలకు సెన్సార్ కత్తెర వేస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లేడీస్ నాట్ అలౌడ్ సినిమాతో నానా తంటాలు పడుతున్న షకీలాకు.. తాజా కుటుంబ చిత్రం విషయంలోనే అలానే జరిగితే ఈ శృంగారతార పరిస్థితేంటో మరి..! 

Shakeela Satires on YS Jagan 3 Capitals:

Shakeela Satires on YS Jagan 3 Capitals

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ