పవన్ కళ్యాణ్‌కి సినిమాల్లో త్రివిక్రమ్ ఎంత స్నేహంగా ఉంటాడో.. సినిమాల్లో కమెడియన్ అలీతోనూ అంతే స్నేహంగా దగ్గరగా ఉంటాడు. పవన్ నటించిన చాలా సినిమాల్లో అలీ కనబడడం అనేది సర్వసాధారణమే. అయితే గత కొన్నాళ్లుగా అంటే రాజకీయాల్లో అలీ, పవన్ జనసేనను సపోర్ట్ చెయ్యకుండా వైసీపీలోకి చేరడంతో... కాస్త కోపం తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, అలీపై చాలా విమర్శలు చేసాడు. పవన్ అన్న మాటలకు అలీ చాలా హార్ట్ అయ్యాడు కానీ.. పవన్ కళ్యాణ్‌ని పెద్దగా మాటలనలేదు. ఇది కేవలం రాజకీయాల వరకే పరిమితం అని, సినిమాలో తమ స్నేహం ఎప్పటిలాగే ఉటుంది అని అలీ చెప్పకనే చెప్పాడు.
ఇక అలీ తాజాగా వైసీపీకి దగ్గరగా ఉండడం లేదు. మరోపక్క అలీ బీజేపీలో చేరుతాడనే ఊహాగానాల నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్, అలీకి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా ఓ వార్త మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ కోసమా? లేదంటే రాజకీయాల్లో జనసేనకు సపోర్ట్ చేయాలని కోరడానికి పవన్ ఫోన్ చేశాడా? అనేది స్పష్టత లేదు. కానీ పవన్ కళ్యాణ్ అలీకి ఫోన్ చెయ్యడం నిజమే అని.. కాకపోతే ఇకనుండి సినిమాలు చెయ్యడానికి సిద్దమయిన పవన్‌కి తోడుగా అలీ ఉండాలనే ఉద్దేశ్యంతోనే పవన్ అలీకి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది.