అఖిల్ అక్కినేని నాలుగో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ టైటిల్ బయటికి వచ్చేసింది. అఖిల్ మూడు సినిమాల ఎఫెక్ట్ ఈ సినిమాపై ఎంతగా పడిందో ఈ టైటిల్ విషయంలోనే అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ టైటిల్ కి క్రేజ్ లేదు. డిజాస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌తో సినిమా చేస్తున్నాడు అనగానే.. అందరూ ఆ ప్లాప్ డైరెక్టర్ కి అఖిల్ ని ఎలా అప్పజెప్పవయ్యా నాగ్ అన్నారు. అయినా భారీ క్రేజ్ తో.. భారీ అంచనాలతో వచ్చిన మూడు సినిమాలు పోయాయి. ఎటువంటి అంచనాలు లేకుండా నాలుగో సినిమా హిట్ అయినా.. అఖిల్ నిలదొక్కుకుంటాడని డిసైడ్ అయ్యారు. అందుకే బడ్జెట్ కూడా చాలా తక్కువ అంటే.. మొదటి మూడు సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను రేంజ్ కాకుండా కేవలం 7 నుండి 8 కోట్ల మధ్యలోనే ఈ చిత్ర బడ్జెట్‌ని సెట్ చేసుకున్నారు.
ఇక సినిమాని కూడా 10 కోట్ల లోపే బిజినెస్ చేస్తే నిర్మాతలకు వర్కౌట్ అవుతుంది అని.. లేదంటే అఖిల్ మూడు సినిమాల దెబ్బకి బయ్యర్లు ఎవ్వరూ ముందుకు రారని.. లో బడ్జెట్ తోనే సినిమాని చుట్టేస్తున్నారు. అఖిల్ కి భారీ బడ్జెట్ పెట్టారు.. అది దిమ్మతిరిగే షాకిచ్చింది. అఖిల్ మీద తగ్గించి హలోకి బడ్జెట్ పెట్టారు. అది అంతే అయ్యింది. ఇక మిస్టర్ మజ్ను సినిమాకి 15 కోట్లలో తీసి 20 కోట్లలో అమ్మారు. అందులో సగం కూడా రాలేదు. అందుకే ఇప్పుడు ఈసినిమాకి బడ్జెట్ తక్కువ పెట్టారట. ఇక హీరోయిన్ పూజా కే ఎక్కువ పారితోషకం. మిగతావన్నీ తక్కువ తక్కువే. అయితే ఇప్పుడు టైటిల్ ని రివీల్ చేసిన అఖిల్ సినిమాకి క్రేజ్ రావడం లేదు. అసలు ఆ టైటిల్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే పదం చదువురాని వాళ్ళకి అంటే బిసి సెంటర్స్ ఆడియన్స్ కి అస్సలు ఎక్కడం లేదు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అంటే కాస్త కాస్ట్‌లీగా, రిచ్ గా కనబడుతున్న పదం. అందుకే చదువుకున్నోళ్లకి, యూత్ కి ఎక్కే టైటిల్ గా ఉంది కానీ.. ఈ టైటిల్ అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్ళినట్టుగా కనిపించడం లేదు. అయినా అఖిల్ కి ఈ టైటిల్ సెట్ కాలేదేమోలే అంటూ అక్కినేని అభిమానులే ఫీలవుతున్నారు. మరి మిగతా ప్రేక్షకులకు ఇంకెలా ఉందో అంటున్నారు. చూద్దాం సినిమా విడుదలయ్యే సరికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అందరి నోళ్ళలో ఎలా నానుతుందో అనేది.