Advertisementt

కాజల్ కల నెరవేరిన వేళ..

Wed 05th Feb 2020 07:16 PM
kajal agarwal  కాజల్ కల నెరవేరిన వేళ..
Kajal dream came true.. కాజల్ కల నెరవేరిన వేళ..
Advertisement
Ads by CJ

 

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన భామ కాజల్ అగర్వాల్.. చందమామ సినిమాతో విజయాన్ని అందుకుని, మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. మగధీర సినిమా తర్వార కాజల్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగులో అందరి స్టార్లతో నటించిన కాజల్ ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ఇండస్ట్రీకి వచ్చి  పదమూడు సంవత్సరాలవుతున్నా చెక్కు చెదరని అందంతో, చూపు తిప్పుకోలేని గ్లామర్ తో ఇంకా సినిమాల్లో నటిస్తుంది. 

 

అయితే ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆమె చేతిలో సినిమాలు మాత్రం ఉన్నాయి. అయితే ప్రస్తుతం విజయాలు లేకపోయినా తన కెరీర్ కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న తన కెరీర్లో మరో మైలు రాయిని చేరుకుంది. నటన పరంగా ఎన్నో అవార్డులు అందుకున్న కాజల్...నేటితో తన జీవితంలో మరో మెట్టుకి ఎదిగింది.

 

ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం నందు హీరోయిన్ కాజల్ మైనపు విగ్రహాన్ని నేడు లాంచ్ చేశారు. సింగపూర్ నందు గల ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించి కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్ గా కాజల్ గుర్తింపు పొందింది. ఆ మైనపు విగ్రహం పక్కన నిల్చుని, ఫోటోలకి ఫోజులిస్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. గతంలో ప్రభాస్, మహేష్ ల విగ్రహాలు కూడా ఇక్కడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Kajal dream came true..:

Kajal wax statue launched in Tussads Museum

Tags:   KAJAL AGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ