‘భాషా’ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తమ్ముడిగా నటించిన ప్రముఖ హీరో శశికుమార్ దక్షిణాది సినీ ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులని అలరించిన శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్నారు.
తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సీతాయణం’ అనే పేరు ఖరారు చేశారు. ప్రముఖ దర్శకులు వై.వి.యస్ చౌదరి, దశరధ్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రభాకర్ ఆరిపాక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఇందులో అక్షిత్ సరసన అనహిత భూషణ్ కధానాయికగా నటిస్తున్నారు . ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘లవ్ , క్రైమ్, డ్రామా తో నడిచే చిత్రమిది. కథ కథనాలు నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఈ కథలో విభిన్న భావోద్వేగాలకు అవకాశం ఉంది. హీరో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ విభిన్నంగా ఉంటుంది. అక్షిత్ శశికుమార్ ఈ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా స్థిరపడిపోవడం ఖాయం. అంత బాగా నటించారు. అలాగే దర్శకుడు కొత్తవారైనా ఎంతో నైపుణ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్యాంకాక్ , హైదరాబాద్ , వైజాగ్ , మంగుళూరు , అగుంభే , బెంగుళూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ పూర్తిచేశాం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని తెలిపారు.
తారాగణం: అక్షిత్ శశికుమార్, అనహిత భూషణ్ ,అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జభర్ధస్ట్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు.
కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
సమర్పణ : రోహన్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి
రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక