బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తమిళనాట సూపర్ హిట్ ‘రచ్చసన్’ సినిమాని తెలుగులో ‘రాక్షసుడు’ సినిమాగా రీమేక్ చేసాడు. సూపర్ సూపెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్ హిట్ కొట్టాడు.‘లో’ బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక నిర్మాత సత్యనారాయణ కూడా ‘రాక్షసుడు’ సినిమాతో భారీ లాభాలు మూటగట్టుకున్నాడు. అయితే రమేష్ వర్మ తమిళ ‘రచ్చసన్’ సినిమాని చెడగొట్టకుండా.. యాజిటీజ్ గా తెలుగులో రీమేక్ చెయ్యడం, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పోలీస్ కేరెక్టర్‌లో పెరిఫెక్ట్‌గా సూట్ అవడంతో.. సినిమా కూడా హిట్ అయ్యింది.
అయితే తనకి మంచి లాభాలు తెచ్చిపెట్టిన దర్శకుడు రమేష్ వర్మకి నిర్మాత సత్యనారాయణ ఇప్పుడొక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మరింది. రమేష్ వర్మకి మూడు కోట్లు విలువ చేసే ఓ ఇంటిని(ఫ్లాట్) ని నిర్మాత సత్యనారాయణ బహుమతిగా అందజేసాడట. మరి రమేష్ వర్మకి అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడంతో రమేష్ వర్మ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తుంది.