Advertisementt

మాది కూడా బాహుబలి విధానమే.. : RRR టీమ్!

Wed 05th Feb 2020 01:14 PM
rrr  మాది కూడా బాహుబలి విధానమే.. : RRR టీమ్!
We are following Bahubali plan..says RRR మాది కూడా బాహుబలి విధానమే.. : RRR టీమ్!
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఆ సినిమా గురించి అంచనాలు వేయడం ప్రారంభించారు. ఇక అందులో నటించే ఇద్దరు హీరోలలో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా చేస్తున్నారని చెప్పినప్పటి నుండి తమ ఊహల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎలా ఉంటారో ఊహించేసుకుని ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఏడాది కావొస్తున్న ఇప్పటి వరకు కనీసం ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

 

 

పండగ వచ్చిన ప్రతీసారి ఈ సారి ఎన్టీఆర్ లుక్ వదులుతాడని, ఈ సారి రామ్ చరణ్ లుక్ వదులుతారని ఆశగా ఎదురుచూస్తున్న వారికి కేవలం పండగ శుభాకాంక్షలు చెప్తూ సరిపెట్టేస్తున్నారు. మొన్నామధ్య ఎన్టిఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుందని ప్రకటించగానే, ఒక్కసారిగా ఒలివియా మోరిస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. కేవలం ఒక్కరోజులోనే నెట్టింట్లో ఆమె కోసం ఎంతో మంది వెతికారు.

 

 

ఈ మధ్య అజయ్ దేవగణ్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే షూటింగ్ జరుగుతున్న విషయమైతే తెలుస్తుంది కానీ, ఒక్క పోస్టర్ కానీ, ఒక్క లుక్ కానీ రివీల్ చేయట్లేదు. ఈ విషయంలో బాహుబలి టీమనుసరించిన విధానాన్నే తాము తాము కూడా అదే విధానాన్ని పాటిస్తున్నామని ఆర్ ఆర్ ఆర్ టీమ్ తెలిపింది. బాహుబలి నిర్వాహకులు సైతం సినిమా విడుదలకి ఒక రెండు నెలల ముందు వరకి ఆశ పెట్టీ పెట్టీ అప్పుడు ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఈ విషయంలో ఆర్ ఆర్ ఆర్ కూడా అలానే చేస్తుందట.  

We are following Bahubali plan..says RRR:

BY not revealing anything from the movie RRR... saying to us we are following Bahubli policies 

Tags:   RRR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ