Advertisementt

మెగాస్టార్‌కు వైఎస్ జగన్ ఊహించని గిఫ్ట్!

Tue 04th Feb 2020 02:31 PM
ap cm,ys jagan,jagan mohan reddy,gift,megastar  మెగాస్టార్‌కు వైఎస్ జగన్ ఊహించని గిఫ్ట్!
AP CM YS Jagan Gives Gift To Megastar! మెగాస్టార్‌కు వైఎస్ జగన్ ఊహించని గిఫ్ట్!
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. మెగాస్టార్‌కు ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అయితే మీరు అనుకుంటున్నట్లుగా టాలీవుడ్ మెగాస్టార్ కాదండోయ్ బాబూ.. మలయాళ మెగాస్టార్.. అసలు ఆయనకు టాలీవుడ్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధం ఏంటబ్బా..? ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా..? ఇదిగో ఇక ఆలస్యమెందుకు ఆర్టికల్ పూర్తిగా చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమవుతుంది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘యాత్ర’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మహి వి. రాఘవ ఈ సినిమా తెరకెక్కించగా సూపర్ డూపర్ హిట్టయ్యింది. వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవడానికి ఇది కూడా ఒకింత ప్లస్ పాయింటే అయ్యింది కూడా. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ సినిమాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించమంటే జీవించేసిన మెగాస్టార్‌కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఇవ్వాలనే అప్పట్లో అనుకున్నారట. అనుకున్నట్లుగానే ప్రభుత్వం వచ్చింది కానీ.. అవార్డు మాత్రం ఇచ్చుకోలేదు. దీంతో.. ఇప్పటి వరకూ ఈ ప్రస్తావన రాకపోగా తాజాగా డైరెక్టర్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి ఈ విషయం చెప్పగా అది సీఎం చెవిన పడిందట.

కచ్చితంగా అవార్డు ఇద్దామని వైఎస్సార్‌గా నటించిన మెగాస్టార్‌కు అవార్డు రూపంలో రుణం తీర్చుకోవాలనే తనకు కూడా ఆలోచన ఉందని ఆయనకు చెప్పారట. ఇది మళ్లీ మహి దాకా చేరడంతో ఆనందంలో మునిగితేలుతున్నారట. అయితే ఇది కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో..? నంది అవార్డునే ఇస్తారా..? లేకుంటే ప్రత్యేకంగా మమ్ముట్టి వరకూ ఏదైనా అవార్డు ఇస్తారా..? అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

AP CM YS Jagan Gives Gift To Megastar!:

AP CM YS Jagan Gives Gift To Megastar!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ