జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. పవన్‌కు సంబంధించిన సీన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 15 తారీఖల్లా పవన్‌పై అన్ని సన్నివేశాలను చిత్రీకరించేస్తారట. ఆ తర్వాత మిగతా సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. సంక్రాంతి అయిపోయిన మరుసటి రోజు నుంచే ఎవరికీ తెలియకుండా.. ఎలాంటి చిన్నపాటి లీక్స్ కూడా లేకుండా షూటింగ్ షురూ చేసేస్తున్నారు. అయినప్పటికీ పవన్‌కు సంబంధించిన లుక్ లీక్ అయిపోయింది. లీకుల వ్యవహారం స్టార్ట్ అవ్వడంతో జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ అవి మాత్రం ఆగలేదు.
ఇదీ డైలాగ్!
ఇదివరకూ లుక్.. ఇప్పుడు ఏకంగా సినిమా డైలాగ్ రిలీజ్ అవ్వడం గమనార్హం. అది కూడా పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ డైలాగ్ అవ్వడంతో చిత్రబృందం లీకులతో లబోదిబోమంటోంది. పవన్ డైలాగ్ చెబుతున్న 20 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ‘నేను నల్లకోటు వేసుకుంటే.. వేయడానికి పిటీషన్స్, తీసుకోవడానికి బెయిల్స్ ఉండవ్’ అని పవన్ చెబుతున్న పవర్ డైలాగ్ ఉంది. బహుశా విలన్‌కు ఈ డైలాగ్ చెబుతున్నాడేమో.!. లీక్ అయితే అయ్యింది కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం మా పవర్‌స్టార్ డైలాగ్ వచ్చేసింది చూడండహో అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోను పెద్దఎత్తున వైరల్ చేస్తున్నారు. మరోవైపు అంతే ధీటుగా పవన్ అంటే పడని వీరాభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
అడ్డుకట్ట ఎలా!?
మరీ ముఖ్యంగా.. మే-15 రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు దిల్‌రాజు ప్రకటన చేసిన నాడే ఇలా లీకులు రావడంతో ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఈ పని ఎవరు చేసుంటారు..? అనేది మాత్రం తెలియరాలేదు. కాగా.. ఇప్పటి వరకూ అంతా సాఫీగానే సాగుతోందని అనుకున్న దర్శకనిర్మాతలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరి ఈ లీకులను ఎలా అరికడతారో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారో ఏంటో..!