సైరా నరసింహా రెడ్డిలో స్వాతంత్య్ర సమరయోధుడుగా నటించాలన్న తన కలను సాకారం చేసుకుని చిరంజీవి అందరినీ అలరించిన తరువాత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
చిరంజీవి ద్విపాత్రాభినయం చెయ్యబోతున్న ఈ సినిమా దేవాదాయ, ధర్మాదాయ ఆలయ నిధులతో సంబంధం ఉన్న మోసాలను బట్టబయలు చేసే స్టోరీ లైన్ తో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇప్పటికే చిరంజీవి - రెజినాపై గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన జానపద పాటను చిత్రీకరించినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రకి తీసుకుంటే బావుంటుంది అని మేకర్స్ యోచిస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి మరియు మోహన్ బాబు గతంలోనే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో - విలన్ పాత్రలతో అదరగొట్టేసాడు. చిరు - మోహన్ బాబుల హీరో - విలన్ కాంబో అద్భుతమైన కాంబో. అందుకే ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు చేత చిరు - కొరటాల సినిమాలో విలన్ రోల్ చేయించాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా టాక్. ఇక ఈ సినిమాలో చిన్న చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ కూడా నటించడంతో అభిమానులు సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.