Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌కు పండగ.. ‘పింక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Tue 04th Feb 2020 12:34 AM
pawan kalyan,pawan pink remake,release date,dil raju  పవన్‌ ఫ్యాన్స్‌కు పండగ.. ‘పింక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Pawan PINK Remake Movie Release Date Fix! పవన్‌ ఫ్యాన్స్‌కు పండగ.. ‘పింక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. పవన్‌కు సంబంధించిన సీన్స్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్‌కు సంబంధించిన లుక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ నెల 15 తారీఖల్లా పవన్‌పై అన్ని సన్నివేశాలను చిత్రీకరించేస్తారట. ఆ తర్వాత మిగతా సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. సంక్రాంతి అయిపోయిన మరుసటి రోజు నుంచే ఎవరికీ తెలియకుండా.. ఎలాంటి చిన్నపాటి లీక్స్ కూడా లేకుండా షూటింగ్‌ షురూ చేసేస్తున్నారు.

మరోవైపు.. సినిమా పేరు కానీ.. ఇందులో పవన్ సరసన.. మరే ఇతర పాత్రల్లో నటించే వారి గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. రిలీజ్ డేట్ మాత్రం ఫలానా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మే-15న మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసేయాలని దిల్ రాజు మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యారట. ఎందుకంటే తనకు మే నెల బాగా అచ్చిరావడంతో.. ఆ నెలలో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్టవ్వడమే కాకుండా కాసుల వర్షం కురిపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఈ క్రమంలో షూటింగ్‌లో కూడా డైరెక్టర్ వేగం పెంచాడు. వీలైనంత త్వరలోనే పవన్‌తో షూటింగ్ ముగించేసి మిగతా సీన్స్‌ చిత్రీకరించాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. మరోవైపు దిల్‌రాజు ఇటు హీరోను.. అటు వేణును తరుముతుండటంతో సినిమా చకచకా షూటింగ్ జరుగుతోందట. మరి ఈ రిలీజ్‌ డేట్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? ఎంతగానో.. ఎన్నిరోజులగానే వేచి చూస్తున్న సినిమా కోసం వేచి చూస్తున్న పవన్‌ ఫ్యాన్స్ ఏమేరకు హిట్ చేస్తారో..? ఏరి కోరి మరీ ఎంచుకున్న ఈ రీమేక్ దిల్‌కు లాభాలు చేకూరుస్తుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే.

Pawan PINK Remake Movie Release Date Fix!:

Pawan PINK Remake Movie Release Date Fix!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ