నాగ శౌర్య హీరోగా, నిర్మాత, రైటర్ గా చేసిన అశ్వద్ధామ బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది గత శుక్రవారం విడుదలైన అశ్వద్ధామకి డివైడ్, యావరేజ్ టాక్స్ పడ్డాయి. అశ్వద్ధామ సినిమాని మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఓ యువకుడి పోరాటం ఈ కథ. రాక్షసుడు సినిమాలా ఓ థ్రిల్లర్‌గా మలిచి హిట్టు కొట్టాలని శౌర్య విశ్వ ప్రయత్నమే చేశాడు. కానీ కథ బావున్నప్పటికీ డైరెక్షన్ వలన సినిమా దెబ్బేసింది. అయితే ఈ సినిమాపై 10 నుండి 12 కోట్ల పెట్టుబడి పెట్టడం ఆ సినిమా 15 కోట్ల బిజినెస్ చేసుకోవడంతో శౌర్య అంత లాగగలడా అనుకున్నారు. ఎందుకంటే నర్తనశాల దెబ్బకి శౌర్య మార్కెట్ బాగా దెబ్బతింది.
అయితే ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 7.కోట్ల గ్రాస్ 4.5 కోట్ల షేర్ సాధించింది. మూడో రోజు మూడు కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల గ్రాస్ అంటే శౌర్య స్థాయికి చాలా ఎక్కువ అనే చెప్పాలి. మొదటి వీకెండ్ లో పర్వాలేదనిపించినా అశ్వద్ధామకి సోమవారం గట్టి పరిక్షే. డివైడ్ టాక్ తో వీక్ డేస్ లో కలెక్షన్స్ రావడం జరగని పనే. వసూళ్లలో డ్రాప్ ఎక్కువే ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. కాకపోతే నాగ శౌర్య అశ్వద్ధామ శాటిలైట్, హిందీ హక్కులతో కాస్త సేవ్ అయ్యాడు. జెమినీ టీవీ 2.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ సొంతం చేసుకుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 1.75 కోట్లు వచ్చాయి.