Advertisementt

న‌వీన్ చంద్ర హీరోగా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’

Mon 03rd Feb 2020 11:14 PM
nenu leni naa prema katha,naveen chandra,first glimpse,kalyan kandukuri  న‌వీన్ చంద్ర హీరోగా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’
Nenu Leni Naa Prema Katha glimpse: Youthful and innovative న‌వీన్ చంద్ర హీరోగా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ‌’
Advertisement
Ads by CJ

విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని మ‌రీ సెల‌క్ట్‌గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ న‌టుడిగా ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న న‌వీన్ చంద్ర హీరోగా ఒ కొత్త‌ర‌కం ప్రేమ క‌థా చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ కందుకూరి నిర్మించన్నారు. ఈ చిత్రానికి టైటిల్‌గా ‘నేను లేని నా ప్రేమ‌క‌థ’గా ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్‌గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి‌లు మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రం యొక్క మొద‌టి లుక్ టైటిల్ ని లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌రువాత ఓ ఫ్రెష్ ల‌వ్ స్టోరితో ద‌ర్శ‌కుడు సురేష్ మా ద‌గ్గ‌ర‌కి రావ‌టం జ‌రిగింది. విన్న‌వెంట‌నే చాలా కొత్త‌గా అనిపించింది. కాన్సెప్ట్ కి క‌నెక్ట్ అయ్యాను. నేనే కాదు ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌త్యేకంగా రాజార‌వీంద్ర పాత్ర అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం టైటిల్ లుక్.. టీజ‌ర్‌ని, పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశాము. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. త్వ‌ర‌లో ఈ మొద‌టి లుక్, మొద‌టి లుక్ టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తాము..’’ అని అన్నారు..

ద‌ర్శ‌కుడు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ అంటే అది ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులోని చ‌క్క‌టి ఫీలింగ్.. ఆ ఫీలింగ్‌ ఎదుట మ‌నిషికి తెలియ‌జేయ‌టం అంటే అంత ఈజీ కాదు అది ప్రేమ విష‌యంలో దేశ ప్ర‌ధాని కూడా చిన్న పిల్ల‌వాడ‌వుతాడు. అలాంటి చ‌క్క‌టి ఫీలింగ్ ని అంతే చ‌క్క‌గా తెర‌కెక్కించిన చిత్రం నేను లేని నా ప్రేమ‌క‌థ‌. ఇలాంటి ప్రేమ‌క‌థని నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టం.. ఆ ఛాన్స్ నిర్మాత క‌ళ్యాణ్‌గారు నాకు ఇవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. ఈరోజు విడుద‌ల చేసిన ఈ టైటిల్ టీజ‌ర్ చాలా వినూత్నంగా వుంద‌ని అంద‌రూ ప్ర‌శంసించ‌టం చాలా ఆనందంగా వుంది. అంత‌:పురం, ఖ‌డ్గం లాంటి అద్భుత‌మైన చిత్రాలకి పనిచేసిన ఎస్‌.కె.ఏ.భూప‌తి అద్భుతమైన విజువ‌ల్స్ అందించారు. అలాగే ఎన్నో చిత్రాల‌కి త‌న ప‌నితనంతో విజ‌యాల్ని సునాయాసం చేసిన ఎడిట‌ర్ ప్రవీణ్ పూడి ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది..’’ అని అన్నారు.

న‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి ఆర్ సురేష్‌, క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి, రాజారవీంద్ర, బంధు దివిజ త‌దిత‌రులు ఈ చిత్రానికి

ఎమ్ ఎస్ సుబ్బ‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌

బ్యాన‌ర్‌.. త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

కో-ప్రోడ్యూస‌ర్స్‌.. గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌

కెమెరా.. ఎస్‌.కె.ఏ.భూప‌తి

ఎడిట‌ర్‌.. ప్ర‌వీణ్ పూడి

మాట‌లు.. స‌భీర్ షా

సంగీతం.. జువెన్ సింగ్‌

లిరిక్స్‌.. రాంబాబు గోసాల‌

పిఆర్ఓ .. ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్‌

Nenu Leni Naa Prema Katha glimpse: Youthful and innovative:

Naveen Chandra New Film title Nenu Leni Naa Prema Katha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ