Advertisementt

మమ్మల్ని అన్ బ్లాక్ చేయండి ప్లీజ్....

Mon 03rd Feb 2020 12:43 PM
harish shankar,pawan kalyan,pspk28  మమ్మల్ని అన్ బ్లాక్ చేయండి ప్లీజ్....
Plase do unblock us. మమ్మల్ని అన్ బ్లాక్ చేయండి ప్లీజ్....
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోల ఫ్యాన్స్ అందరిలోకి పవన్ ఫ్యాన్స్ కొంచెం వేరుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ని కొంచెం విమర్శించినా వారు ఊరుకోరు. అలా విమర్శించింది ఎవరనేది కూడా చూడకుండా వారి మీద సోషల్ మీడియాలో రకరకాలుగా విరుచుకుపడుతుంటారు. అప్పట్లో బన్నీ చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా డీజే, సరైనోడు సినిమాల విషయంలో నెగెటివ్ ప్రచారం చేసారనే టాక్ కూడా నడిచింది.

 

అయితే అదే సమయంలో డీజే దర్శకుడయిన హరీష్ శంకర్ మీద కూడా ఫ్యాన్స్ విరుచుకు పడ్డారు. పవన్ ఫ్యాన్ అయ్యుండి అల్లు అర్జున్ తో సినిమా ఎలా తీస్తావంటూ రకరకాల మెసేజ్ లు చేసేవారట. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక హరీష్ శంకర్ చాలా మందిని బ్లాక్ చేసాడట. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాన్ తో హరీష్ శంకర్ మళ్ళీ సినిమా చేస్తున్నాడన్న వార్త బయటకి వచ్చింది. ఈ వార్త బయటకి వచ్చిన దగ్గరి నుండి అప్పట్లో హరీష్ తిట్టినవాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారట.

 

ఎవరినైతే బ్లాక్ చేశాడో వారందరూ, తమని అన్ బ్లాక్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారట. గబ్బర్ సింగ్ లాంటి విజయాన్నందించిన దర్శకుడితో మళ్ళీ పవన్ జతకట్టబోతున్నాడని తెలిసి, హరీష్ శంకర్ తో స్నేహంగా ఉండేందుకు సిద్ధం అవుతున్నారట. వారి రిక్వెస్ట్ లని మన్నించిన హరీష్ కూడా అన్ బ్లాక్ చేసుకుంటూ వెళ్తున్నాడట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మరో గబ్బర్ సింగ్ అవుతుందా లేదా చూడాలి.

Plase do unblock us.:

Pawan Kalyan fans are doing messages to harish Shankar..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ