తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా ఉన్న ఘట్టమనేని నరేశ్‌ను తొలగించడానికి రంగం సిద్ధమైందా..? వివాదాలే ఆయన పదవి పీకేయిస్తున్నాయా..? టాలీవుడ్ పెద్దలు ఎంత చెప్పినా వినకపోవడం.. సంచలన ఆరోపణలు రావడంతో ఇప్పటికే చెప్పాల్సినవన్నీ చెప్పిన పెద్దలు.. తొలగించేయాలని ఫిక్సయిపోరా..? త్వరలోనే ఆయన్ను తొలగించి ఎన్నికలు జరపాలని అనుకుంటున్నారా..? అంటే.. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలు వ్యవహారం ఇదీ!
‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని ఇప్పటి వరకూ సభ్యుల్లో గొడవల్లేని రోజు లేదు. లోలోపల తిట్టుకుంటున్నారు.. ఆరోపణలు చేసుకుంటున్నారు సరే.. మీడియా ముందుకొచ్చి ఒకరిపై సంచలన ఆరోపణలు చేసుకోవడంతో వారంతకు వారే ఇంటిగుట్టును వీధిలో పెట్టేసుకున్నారు. దీంతో.. ఇండస్ట్రీ పరువు పోకూడదని పలువురు పెద్దలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేశారు. మొదటి అంతా ఓకే అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ యథావిథిగా గొడవలే.. మరీ ముఖ్యంగా.. డైరీ ఆవిష్కరణలో జరిగిన వివాదం టాలీవుడ్‌లో ఓ బ్యాడ్‌గా మిగిలిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఈ వ్యవహారం ఆఖరికి హీరో రాజశేఖర్ రాజీనామా దాకా వెళ్లడం గమనార్హం. ఈ గొడవకు కర్త, కర్మ, క్రియ మాత్రం నరేశే..!.
నరేశ్‌ను పీకేస్తారా!?
ఆ తర్వాత.. నరేశ్ ‘మా’ కార్యక్రమాల్లో, సభ్యులను ఆపద సమయంలో ఆదుకోకపోగా.. డబ్బులన్నీ తినేస్తున్నారని కూడా సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అతన్ని పక్కన పెట్టాలని ఓ లేఖను సైతం క్రమశిక్షణా సంఘానికి పంపడం జరిగింది. ఈ కమిటీలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజుతో పాటు మరికొందరు సభ్యులుగా ఉన్నారు. అయితే అస్తమాను ఇలా గొడవలు రావడం.. నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయన్ను పక్కనెట్టి.. త్వరలోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పెద్దలు ఫిక్స్ అయ్యారట. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ లీకులు మాత్రం పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. మరి ఇదే నిజమైతే మళ్లీ ప్యానెల్.. ఎన్నిక..? ఈ సారి మళ్లీ ఎవరు నిలబడతారో..? ఏంటో..!. అయితే ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగక తప్పదు మరి.