కోలీవుడ్ లో వరస సినిమాలతో పిచ్చెక్కిస్తున్న అమలాపాల్ ప్రస్తుతం అడో ఆంధ పరవై పోలా, ఆడు జీవితం, కాడవీర్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. మరోపక్క టాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ రీమేక్ లో కూడా నటిస్తోంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రేమ పెళ్లి అంటూ కోలీవుడ్ దర్శకుడుని వివాహం చేసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంత త్వరగా పెళ్లి ప్రేమ ఆందో.. అంతే త్వరగా భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుందని అప్పట్లో అమలాపాల్ విడాకుల విషయం సంచలనమైంది. అనేక కారణాలు అమల విడాకులకు కారణమంటూ ప్రచారంలోకొచ్చాయి.
అయితే తాజాగా అమల భర్త ఎఎల్ విజయ్ తండ్రి ఎఎల్ అజగప్పన్ విజయ్ మరియు అమలాపాల్ విడాకుల గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. అమలకి, విజయ్ కి విడాకులు తీసుకోవడానికి కారణం విడాకులకు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కారణమని, అమలాపాల్ వివాహం తర్వాత సినిమాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నదని అయితే ధనుష్ తన ప్రొడక్షన్ వెంచర్ అమ్మ కనక్కులో సంతకం చేసి, ఆపై సినిమాల్లో నటించడం ప్రారంభించింది అని దీనివల్ల ఆమె మరియు అతని కుమారుడు విజయ్ మధ్య విభేదాలు వచ్చాయని అందుకే అమల, విజయ్ విడాకులు తీసుకున్నారని ఆయన చెబుతున్నాడు. మరి అప్పట్లో ధనుష్ తో అమలాపాల్ క్లోజ్ గా ఉందని ధనుష్ ని రజిని కూడా హెచ్చరించాడనే న్యూస్ నడిచింది.