అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ లో ఆనందంగా ఉన్నాడని, ఆ తర్వాత విదేశాలకు వెళ్లి కాస్త మేకోవర్ అయ్యి మరీ సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతాడని న్యూస్ ఉంది. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు అలాంటిదేం చెయ్యడం లేదని సైలెంట్ గా మరో పని చేస్తున్నాడనే న్యూస్ తాజాగా రివీల్ అయ్యింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫుల్ ఖుష్ లో ఉండి సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతాడనుకున్నవారికి అల్లు అర్జున్ భారీ షాకిచ్చాడు. అదేమిటంటే అల్లు అర్జున్ తమిళనాట ఓ సినిమా చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో బన్నీ బై లింగ్యువల్ మూవీ మొదలెట్టిన తర్వాత సైలెంట్ అవ్వడంతో ప్రస్తుతం బన్నీ తమిళ ఎంట్రీ వాయిదా పడింది అనుకున్నారు.
కానీ తాజాగా బన్నీ కోలీవుడ్ నిర్మాతలైన లైకా ప్రొడక్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు సైలెంట్ గా మురుగదాస్ తో కలిసి షూటింగ్ కూడా మొదలెట్టేశాడని చెబుతున్నారు. చిన్న రూమర్ కూడా లేకుండా బన్నీ కొత్త సినిమా కోలీవుడ్ సెట్స్ మీద అనేసరికి అందరికి షాక్. ఇంతకీ ఈ విషయాన్నీ కోలీవుడ్ మీడియా కోడై కుయ్యడమే కాదు టాలీవుడ్ లోను ఈ ముచ్చటని ఓ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇంతకీ ఈ సైలెంట్ మూవీ విషయం దర్బార్ డిస్ట్రిబ్యూటర్స్ వలన బయటికొచ్చింది. వాళ్ళు గొడవ చేస్తూ లైకా ప్రొడక్షన్ ఆఫీస్ కి రాగా వారంతా బన్నీ సినిమా సెట్స్ వద్ద ఉన్నట్టుగా మురుగదాస్ దర్శకుడిగా బయటికొచ్చిన న్యూస్ మాత్రం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అందుకే అందరూ హమ్మ బన్నీ అంటున్నారు.