Advertisementt

నయనతార అంత ఇబ్బంది పెడుతుందా?

Sun 02nd Feb 2020 10:22 PM
producer,comments,nayanthara,movies,tollywood,remuneration  నయనతార అంత ఇబ్బంది పెడుతుందా?
Producer’s Sensational Comments on Nayanthara నయనతార అంత ఇబ్బంది పెడుతుందా?
Advertisement
Ads by CJ

ముందు నుండి నయనతార అంటే నిర్మాతలకు టెంక్షన్. ఎందుకంటే నయనతార భారీగా డిమాండ్ చేస్తుంది. అలా అని కనీసం ప్రమోషన్స్ కి రాదు. అయినా ఆమె క్రేజ్ వలన నయనతార ఉంటే చాలు. మా సినిమాకి బోలెడంత క్రేజ్ అంటూ.. నిర్మాతలు నయనతారని తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. రోల్ ఏదైనా పారితోషకం ఎక్కువగా డిమాండ్ చేసే నయనతార వలన చాలా మంది నిర్మాతలు సఫర్ అవుతున్నప్పటికీ.. ఆమె క్రేజ్, ఫేమ్ ముందు తలొంచేస్తున్నారు. ఎందుకంటే కోలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే నయనతార క్రేజ్ టాప్ వన్ లో ఉంది కాబట్టి. అయితే ఇప్పుడొక నిర్మాత నయనతార వలన నిర్మాతలు ఎంతగా సఫర్ అవుతున్నారో అనేది రివీల్ చేసినాడు.

నయనతార పారితోషకం విషయంలో ఎలాంటి పట్టు విడుపు ఉండదు. అయితే అది నిర్మాతలకు కూడా ఓకే. కానీ నయనతార తన పర్సనల్ స్టాఫ్ కి కూడా నిర్మాతల నుండే డబ్బు పిండుతుంది అని నిర్మాతలిచ్చే స్వేచ్చని నయన్ దుర్వినియోగం చేస్తుంది అంటూ ఓ నిర్మాత ఆరోపించడం కోలీవుడ్, టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. నయనతార పర్సనల్ డ్రైవర్ దగ్గరనుండి, ఆమె మేకప్ మ్యాన్ వరకు, ఇంకా నయనతార పర్సనల్ వ్యవహారాలు చూసుకునే స్టాఫ్ కి కూడా ఆ నిర్మాతలే డబ్బు ఇవ్వాలట. ఆఖరుకి కార్ డీజిల్ బిల్ కూడా నిర్మాత ఎకౌంట్ లోనే పడుతుంది. నయనతార పారితోషకం ఐదారు కోట్లు ఉంటే ఆమె పర్సనల్ ఖర్చులే 50 లక్షల వరకు ఉంటుంది అని ఆ నిర్మాత బహిరంగంగా నయనతారని విమర్శిస్తున్నాడు. మరి ఒక్క నిర్మాతే నయన్ వలన సఫర్ అయ్యాడా? మిగతా వాళ్లేందుకు మాట్లాడడం లేదో అంటున్నారు.

Producer’s Sensational Comments on Nayanthara:

Shocking News about Nayanthara   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ