ప్రస్తుతం కియారా అద్వానీ కావాలంటే భారీగా సమ్పరించాల్సిందే అంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు. బాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో దూకుసుకుపోతున్న కియారా అద్వానీని టాలీవుడ్ నిర్మాతలిద్దరు తాజాగా సంప్రదించగా పారితోషకం విషయంలో వాళ్ళకి కియారా షాకిచ్చినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. మరి కియారా అద్వానీ అడిగింది అని కాదు కానీ బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలతో బిజీగా వున్న హీరోయిన్ ని తీసుకురావాలంటే ఆ మాత్రం ఇవ్వాల్సిందే. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం కియారాకి ఇక్కడ హిట్ లేదు కానీ భారీ పారితోషకం ఎలా ఇవ్వాలంటున్నారు. భరత్ అనే నేను యావరేజ్ హిట్, వినయ విధేయరామ ప్లాప్ కొట్టిన కియారా అద్వానీకి తెలుగులో క్రేజ్ లేదు.
కానీ బాలీవుడ్ లో అమ్మడు క్రేజ్ చూసాక టాలీవుడ్ నిర్మాతల కన్ను కియారా మీద పడింది. ఇప్పటికే వరుణ్ తేజ్ కోసం, రీసెంట్ గా రామ్ చరణ్ కోసం కియారాని సంప్రదించగా నాకు 5 కోట్లు ఇస్తే డేట్స్ అడ్జెస్ట్ చేస్తా అంటూ వాళ్ళకి షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. మరో పక్క బాలీవుడ్ లో కియారా క్రేజ్ మాములుగా లేదు. అక్కడ అమ్మడుకి మీడియం రేంజ్ దగ్గరనుండి స్టార్ హీరోల నుండి భారీ డిమాండ్ ఉంది. అందుకే కియారా ఆ క్రేజ్ ని సౌత్ లోను వదలనని డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. మరి ఇక్కడ క్రేజ్ లేని హీరోయిన్ కి ఐదు కోట్లు ఇవ్వడం కన్నా ఇక్కడ డిమాండ్ ఉన్న పూజా, రష్మికతో అడ్జెస్ట్ అయ్యేలా కనబడుతుంది.