Advertisementt

పవన్ రీ ఎంట్రీ ఈ సినిమాతోనే అయితే..?

Sun 02nd Feb 2020 01:47 PM
pawan kalyan,harish shankar,power star  పవన్ రీ ఎంట్రీ ఈ సినిమాతోనే అయితే..?
What would happen if it is his Re entry Movie? పవన్ రీ ఎంట్రీ ఈ సినిమాతోనే అయితే..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రతి రోజూ ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే అటు రాజకీయాలు చేస్తూనే ఇటు సినిమాల్లోనూ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తున్న సంగతి తెలిసిందే.

 

నిన్నటి వరకు పింక్ సినిమా రీమేక్, క్రిష్ తో చేసే మూవీలోనే నటిస్తున్నాడని తెలిసింది. కానీ ఇప్పుడు పవన్ మరో రెండు చిత్రాలకి కూడా సైన్ చేశాడట. అందులో ఒకటి దర్శకుడు హరీష్ శంకర్ తో ఉండనుంది. హరీష్ శంకర్ గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న పవన్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిందీ ఈ చిత్రం.

 

 

అయితే మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మరో గబ్బర్ సింగ్ లాంటి సినిమా వస్తుందని ఆశపడుతున్నారు. అయితే పవన్ రీ ఎంట్రీ సినిమా హరీష్ తో అయితేనే బాగుండేదేమోనని ఆలోచిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ఎలా పేలాయో అందరికీ తెలిసిందే. హరీష్ తో గనక పవన్ రీ ఎంట్రీ ఉంటే ఆ సినిమా మరో రేంజ్ లో ఉండేదని అంటున్నారు. ఏది ఏమైతేనేం ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్ లో మరో గబ్బర్ సింగ్ లాంటి సినిమాని చూడబోతున్నాం. 

What would happen if it is his Re entry Movie?:

Pawan kalyan next movie with Harish Shankar..who had given a blockbuster for Pawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ