జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ కూడా షురూ అయిపోయాయి. వాటిలో ఒకటి ‘పింక్’ రీమేక్‌కు వేణు శ్రీరామ్.. మరో సినిమాకు క్రిష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం నాడు మైత్రీ మూవీస్ ఊహించని ప్రకటన చేసింది. హరీశ్ శంకర్-పవన్ కాంబోలో సినిమాను నిర్మిస్తున్నట్లు మైతీ మూవీస్ ప్రకటించింది. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మరోసారి ఇదే కాంబో రిపీట్ కానుండటంతో మరోసారి దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇవన్నీ అటుంచితే.. పవన్-క్రిష్ మూవీలో ఇప్పటికే పవన్ పాత్ర అలా ఉండబోతోంది..? ఇలా ఉండబోతోంది..? ఫలానా బ్యూటీని పవన్ సరసన నటిస్తోంది..? అని పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయ్. ఈ పుకార్లు అలా ఉండగా.. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్. ఈ సినిమాకు ఆమె పాత్రే కీలకం అని.. ఆమె చుట్టూనే కథ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే.. ఆమెను కూడా సినిమాలో నటించాలని సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ఇప్పటికే.. ఈ కాంబోలో వచ్చిన ‘బద్రి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వగా.. ‘జానీ’ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదు. అయితే పైన చెప్పిన వర్కవుట్ అయితే మాత్రం ముచ్చటగా నటిస్తారన్నమాట. ఇదిలా ఉంటే.. మంచి మంచి పాత్రలు వస్తే తాను చేయడానికి రెడీగా ఉన్నానని.. ఓ ఇంటర్వ్యూలో రేణు చెప్పుకొచ్చింది. మరి పవన్ సినిమాలో రేణు నటించేది నిజమేనా..? అసలు ఇది జరిగే పనేనా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.