Advertisementt

ఆర్జీవీ ఎమోషనల్ ట్వీట్.. సినిమా కథ రెడీ!?

Sun 02nd Feb 2020 03:45 PM
rgv,ramgopal varma,emotional tweet,nirbhaya,disha incident  ఆర్జీవీ ఎమోషనల్ ట్వీట్.. సినిమా కథ రెడీ!?
RGV Emotional Tweet.. Movie Story Ready! ఆర్జీవీ ఎమోషనల్ ట్వీట్.. సినిమా కథ రెడీ!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మూడు వివాదాలు.. ఆరు తిట్లే నాకు కావాల్సింది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. అయితే ఎప్పుడూ అలా వివాదాలతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ.. బహుశా ఆయన లైఫ్‌లో ఫస్ట్ టైమ్ మాత్రం ఓ ఎమోషనల్‌ ట్వీట్ చేశాడు. ఆ ట్వీ్ట్ చూసిన నెటిజన్లు, వీరాభిమానులు కంగుతిన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా వార్తలు కోకొల్లలు. దేశ వ్యాప్తంగా ఇప్పుడే ఇదే కేసుపై హాట్ హాట్‌గా చర్చిస్తున్నారు. 

 నా తర్వాతి సినిమా!?

ట్విట్టర్‌ వేదికగా వరుసగా ఎమోషనల్‌గా ట్వీట్స్ చేశాడు. ‘నా తర్వాతి సినిమా ‘దిశ’. దిశ రేప్ అండ్ మర్డర్ ఉదంతం గురించి మూవీ తెరకెక్కించబోతున్నాను. నిర్భయ ఘటన తర్వాత అంతకంటే దారుణంగా.. ఊహించని విధంగా ఓ ఆడపిల్లను నలుగురు రేప్ చేసి సజీవదహనం చేశారు. అప్పటి రేపిస్ట్‌ల నుంచి.. నేటి తరం రేపిస్టులు ఏం నేర్చుకుంటున్నానారో ఈ సినిమాలో గుణపాఠంగా చూపించబోతున్నాను. నిర్భయను అత్యాచారం చేసి.. రోడ్డు మీద వదిలేసి వెళ్తే.. పోలీసులకు దొరికిపోయారు. కానీ దిశను ఆధారాలు దొరకకూడదని సజీవదహనం చేశారు’ అని ఆర్జీవీ ట్వీట్లు చేశాడు.

మోదీ గారూ..!?

అంతటితో ఆగని ఆయన.. నిర్భయ నిందుతుల తరుఫున వాదనలు వినిపిస్తోన్న లాయర్ ఏపీ సింగ్‌పై వర్మపై కూడా హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. ‘లా’ లో ఉన్న లూప్‌హోల్స్ అడ్డుపెట్టుకుని లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నారు. వాళ్లని ఆడుకునేలా నా మూవీ ఉంటుంది. ఒక్కసారి నిర్భయ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని ఊహించగలరా మోదీ గారూ..?. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’ అని ఎమోషనల్‌గా ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్స్‌పై వీరాభిమానులు, నెటిజన్లు చాలా వరకు పాజిటివ్‌గానే కామెంట్స్ వస్తున్నాయి.

RGV Emotional Tweet.. Movie Story Ready!:

RGV Emotional Tweet.. Movie Story Ready!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ