Advertisementt

పవన్ ముచ్చటగా ‘మూడు’.. పూర్తి వివరాలివిగో!

Sun 02nd Feb 2020 03:36 PM
pawan three movies,pink remake,krish movie,details  పవన్ ముచ్చటగా ‘మూడు’.. పూర్తి వివరాలివిగో!
Pawan Three Movies.. Details Here..! పవన్ ముచ్చటగా ‘మూడు’.. పూర్తి వివరాలివిగో!
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు ఈ ‘పింక్’ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. పవన్‌కు సంబంధించిన సీన్స్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్‌కు సంబంధించిన లుక్స్ కూడా లీక్ అయ్యాయి. ఈ నెల 15 తారీఖల్లా పవన్‌పై అన్ని సన్నివేశాలను చిత్రీకరించేస్తారట. ఆ తర్వాత మిగతా సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కాగా.. పవన్ సరసన పూజా హెగ్దే అని కొన్ని రోజులుగా.. ఆ తర్వాత మరికొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

రెండో సినిమా సంగతిదీ!?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్‌ కూడా పవన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే హైదరాబాద్‌లో షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయిందని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే నిప్పులేనిదే పొగరాదుగా.. అన్నట్లుగా పవన్ రెండో సినిమా కూడా నిజమేనని స్పష్టమైపోయింది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’ను మించిన సినిమా ఇదని.. పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిలా కనిపించబోతున్నారని లీకులు వస్తున్నాయ్!. నగరంలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ కూడా వేశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరైన సోనాక్షి సిన్హా కూడా పవన్‌తో రొమాన్స్ చేయనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మాత్రం ఇంతవరకూ అధికారికంగా బయటికి రాలేదు.

మూడో సినిమా పరిస్థితి ఇదీ..

ఈ రెండు సినిమాలు అటుండగా.. పవన్ వీరాభిమానులకు మైత్రీ మూవీస్ తియ్యటి శుభవార్త అందించింది. త్వరలోనే హరీశ్ శంకర్-పవన్ కాంబోలో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ తెరకెక్కించిన హరీశ్ సూపర్ డూపర్ హిట్ చేశాడు. అయితే.. ఈ కాంబోలో అయితే మరో బ్లాక్ బస్టర్ సినిమా చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పూర్తి వివరాలను అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తామని ట్విట్టర్ వేదికగా మైత్రీ మూవీస్ ప్రకటించింది.

మొత్తానికి చూస్తే.. రీ ఎంట్రీతో పవన్ ముచ్చటగా మూడు సినిమాలతో అలరించబోతున్నాడటన్న మాట. మరి ఈ మూడింటిలో ఎన్ని సక్సెస్ అవుతాయో.. ఏవి ‘అజ్ఞాతవాసి’లాగా అడ్రస్ లేకుండా పోతాయో..? అన్నయ్యకు అచ్చొచ్చిన రీ ఎంట్రీ.. తమ్ముడికి ఏ మాత్రం కలిసొస్తుందో తెలియాలంటే సినిమాలు రిలీజ్ అయ్యేంత వేచి చూడాల్సిందే మరి.

Pawan Three Movies.. Details Here..!:

Pawan Three Movies.. Details Here..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ