టాలీవుడ్ కుర్ర హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరిగ్గా లవర్స్‌డే రోజున (ఫిబ్రవరి-14) థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ చేశాడు. అయితే.. సినిమా కాస్త అటు ఇటు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో థియేటర్లలోకి వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమా తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో విజయ్.. ‘ఫైటర్’ చేయాలని ఇదివరకే ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ కాకమునుపే పూరీ జోరు పెంచడంతో ఆయన స్పీడ్ చూసిన విజయ్ ఉలిక్కిపడ్డాడట. ఇదేంట్రా బాబూ ఈయన ఇంత స్పీడు మీదున్నాడని కంగుతిన్నాడట. ఇదివరకు తాను చేసిన డైరెక్టర్స్ ఎవ్వరూ ఈ రేంజ్ స్పీడ్‌లో లేరు బాబోయ్ అని ఆశ్చర్యపోయాడట. కాగా ఫస్ట్ షెడ్యూల్‌లోనే పూరీ పనితనానికి ఆయన ఫిదా అయిపోయాడట. కాగా.. ‘ఫైటర్’లో విజయ్ ఓ బాక్సర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. కాగా.. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర పోషిస్తోంది.