Advertisementt

విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ టీజ‌ర్ వదిలారు

Sun 02nd Feb 2020 01:35 AM
hero nani,produced,hit movie,teaser,release  విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ టీజ‌ర్ వదిలారు
Hit Movie Teaser Released విశ్వ‌క్ సేన్ ‘హిట్‌’ టీజ‌ర్ వదిలారు
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

‘దిస్‌ జాబ్ విల్ డెస్ట్రాయ్‌ యు విక్ర‌మ్‌..యూ నీడ్ టు క్విట్ ది డిపార్ట్‌మెంట్‌’ అని విశ్వ‌క్ సేన్‌తో అంటారు ‘డిపార్ట్‌మెంట్‌ను మాత్రం నేను వ‌ద‌ల్లేను’ అని విశ్వ‌క్ సేన్ చెబుతాడు.

ఈ డైలాగ్‌తో ‘హిట్‌’ టీజ‌ర్ ఆస‌క్తిగా ప్రారంభ‌మైంది. ఏదో సీరియ‌స్ కేసును విశ్వ‌క్‌సేన్ డీల్ చేసేలా స‌న్నివేశాల‌ను టీజ‌ర్‌లో చూడొచ్చు. ఎవ‌రో బైక‌ర్‌ను పోలీసులు వెంటాడుతున్న సీన్‌ను కూడా టీజ‌ర్‌లో చూడొచ్చు.  వివేక్ సాగ‌ర్ సంగీతం.. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానున్నాయి. ప్ర‌స్తుతం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల చేస్తున్నారు.

న‌టీన‌టులు:

విశ్వ‌క్‌సేన్‌, రుహానీ శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శైలేష్ కొల‌ను

స‌మ‌ర్ప‌ణ‌:  నాని

నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని

మ్యూజిక్‌:  వివేక్‌సాగ‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ:  మ‌ణికంద‌న్‌

ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌

ఎడిటర్‌:  గ్యారీ బి.హెచ్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)

స్టంట్స్‌: న‌భా

ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌:  అనిల్ భాను

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా

Hit Movie Teaser Released:

Hero Nani Produced Hit Movie Teaser Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ